సినిమా

Mahesh-Trivikram: మ‌హేష్‌-త్రివిక్ర‌మ్‌ల హ్యాట్రిక్ మూవీపై న‌యా అప్డేట్‌.. ఇక త‌గ్గేదే లే!?

Share

Mahesh-Trivikram: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు `స‌ర్కారు వారి పాట‌` అనంత‌రం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబోలో అత‌డు, ఖ‌లేజా వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌చ్చాయి. దీంతో వీరి హ్యాట్రిక్ మూవీపై భారీ బ‌జ్ నెల‌కొంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

మ‌హేష్‌కు ఇది 28వ చిత్రం కావ‌డంతో.. ఇటీవ‌లె `ఎస్ఎమ్‌బీ 28` అనే వర్కింగ్ టైటిల్‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఇందులో మ‌హేష్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. అలాగే సెకెండ్ హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీ‌లీలా క‌నిపించ‌నుంద‌నే టాక్ ఇది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీపై న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అదేంటంటే.. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌కు మేక‌ర్స్ ముహూర్తం పెట్టేశార‌ట‌. వాస్త‌వానికి ఏప్రిల్‌లోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్కాల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మైంది. అయితే జూలై రెండో వారం నుంచి ఈ మూవీని ఫ‌స్ట్ షెడ్యూల్ మొదలు కానుందట. ఈ లోపు స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్‌ చేసుకుని రెడీగా ఉండబోతున్నారు త్రివిక్రమ్‌.

ఈ సినిమాని ఆల‌స్యం చేయ‌కుండా త్వ‌ర‌త్వ‌ర‌గా కంప్లీట్ చేయాల‌ని మ‌హేష్ భావిస్తున్నార‌ట‌. ఆ వెంట‌నే రాజమౌళితో చేయబోయే ప్రాజెక్ట్ లో ఆయ‌న బిజీ కావాల‌ని ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. మొత్తానికి ఇక‌పై మ‌హేష్ త‌న ప్రాజెక్ట్‌ల విష‌యంలో త‌గ్గేదే లే అంటూ దూసుకుపోనున్నారు.


Share

Related posts

Salaar: ‘సలార్‌’లో మరో బాలీవుడ్ బ్యూటీ..!

GRK

Prabhas: రాధే శ్యామ్ లో మిస్సైంది ఇవే..అందుకే ఇలాంటి టాక్..!

GRK

విశ్వ‌క్ సేన్ `కార్టూన్‌`

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar