Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకటి. కేజీఎఫ్‌తో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంతో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా సలార్ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులనూ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందట.
అయితే అమెజాన్ ప్రైమ్, సలార్ మేకర్స్ మధ్య ఎన్ని కోట్లకు డీల్ కుదిరిందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్ను అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ. 200 కోట్లను చెల్లించి మరీ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజముందో తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
కాగా, ప్రభాస్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈయన ఇప్పటికే `రాధేశ్యామ్` చిత్రాన్ని పూర్తి చేశాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతోంది. అలాగే ప్రభాస్ ఓం రౌత్ డైరెక్షన్లో `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్-కె` చిత్రాలు చేస్తున్నాడు. ఇవి పూర్తి అయిన తర్వాత ప్రభాస్ `స్పిరిట్` మూవీ చేయనున్నాడు.