NewsOrbit
సినిమా

Thalapathy 66: విజ‌య్‌-ర‌ష్మికల మూవీలో శ్రీ‌కాంత్‌.. సంక్రాంతినే టార్గెట్ అట‌!

Thalapathy 66: కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి, టాలీవుడ్ ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక జంట‌గా ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

`దళపతి 66` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఇటీవ‌లె ఈ మూవీ ప్రారంభం అయింది. రెగ్యుల‌ర్ అయితే ఈ సినిమాలో టాలీవుడ్ సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ఆయ‌నొక్క‌రే కాదండోయ్‌.. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, జయసుధ, కిక్ శ్యామ్, సంగీత, యోగిబాబు లు ఈ మూవీలో ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్న నటీనటులు.

ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా తెలియ‌జేశారు. మొత్తానికి భారీ తారాగ‌ణంతోనే వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నార‌ని స్ప‌ష్టంగా అర్థ‌మైంది. అయితే ఈ సినిమా గురించి మ‌రో ఆస‌క్తిక‌ర అప్డేట్‌ నెట్టింట ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు.

ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ప్ర‌స్తుతం సంక్రాంతి టార్గెట్‌తోనే షూటింగ్‌ను శ‌ర‌వేగంగా ఫినిష్ చేస్తున్నార‌ట‌. కాగా, ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మేక‌ర్స్ హైద‌రాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభించారు. భారీ అంచ‌నాలు ఉన్న ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నాడు.

author avatar
kavya N

Related posts

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri