Adipurush: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కెరియర్ చాలా స్లోగా నడుస్తోంది. “బాహుబలి” వంటి హిస్టారికల్ హిట్ కొట్టాక… మళ్లీ అదే తరహాలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. అన్ని పాన్ ఇండియా సబ్జెక్టులు చేస్తున్నా గాని ప్రభాస్ కి విజయం వరించడం లేదు. గతంలో రాజమౌళితో “చత్రపతి” వంటి సినిమా తీసిన తర్వాత కెరియర్ పరంగా మళ్ళీ ఆ స్థాయిలో ప్రభాస్ హిట్ కొట్టలేకపోయాడు. అయితే ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో..”ఆదిపురుష్” అనే సినిమా చేయడం జరిగింది.
త్రీడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వాస్తవానికి జనవరి నెలలో సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కావాల్సింది. కానీ వీడియో గ్రాఫిక్స్ వరకు మాత్రం చాలా దారుణంగా ఉండటంతో.. అభిమానుల నుండి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దీంతో ఇప్పుడు VFX గ్రాఫిక్స్ వరకు మొత్తం మారుస్తూ జూన్ నెలలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే వచ్చే నెల 30వ తారీకు శ్రీరామనవమికి రెండో టీజర్ రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. గత ఏడాది దసరా పండుగ నేపథ్యంలో విడుదల చేసిన మొదటి టీజర్ కీ బాగా నెగిటివిటీ వచ్చింది. ఈసారి అటువంటి పొరపాటు జరగకుండా మేకర్స్ చర్యలు తీసుకోవడం జరిగింది అంట.
దీంతో రెండో టీజర్ ఎలా ఉంటుందో టెన్షన్ లో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పెట్టే సినిమాలు లైన్లో పెట్టడం జరిగింది. “ఆదిపురుష్” మొత్తం కూడా టెక్నికల్ వర్క్ జరుపుకుంటుంది. షూటింగ్ పరంగా మొత్తం కంప్లీట్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్టు కే… సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ రెండిటిలో “సలార్” ఏడది సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. “ప్రాజెక్టు కే” వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ నేపథ్యంలో రిలీజ్ కానుంది. మరి ప్రభాస్ ఏ సినిమాతో విజయం సాధిస్తాడో చూడాలి.