31.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

SSMB 28: మహేష్ బాబు..త్రివిక్రమ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ కి సంబంధించి సరికొత్త అప్డేట్..??

Share

SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలలో మొదలైన ఈ సినిమా షూటింగ్ వాయిదాల పడుతూ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరణించడం అంతకుముందు తల్లి ఇందిరాదేవి మరణించడంతో మహేష్ తల్లడిల్లిపోయారు. ఈ ఒక్క సినిమా చేస్తున్న సమయంలో మహేష్ మానసికంగా చాలా కృంగిపోవడం జరిగింది. మొదటి షెడ్యూల్ బాగానే చేసినా గాని సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కావడానికి చాలా టైం పట్టింది. హీరోయిన్ పూజ హెగ్డే గాయాలు పాలు కావడంతో… ఆమె కూడా చాలా లేట్ గా షూటింగ్ లో పాల్గొంది.

New update regarding Mahesh Babu Trivikram's new movie first look

ఈ ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ తో కూడిన టైటిల్ కూడా ప్రకటించడానికి త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఉగాది పండుగ నాడు..”SSMB 28″ ఫస్ట్ లుక్ తో కూడిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమాలో మహేష్ చాలా వైవిధ్యంగా కనిపించనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన ఖలేజా, అతడు రెండు కూడా.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

New update regarding Mahesh Babu Trivikram's new movie first look

నటన పరంగా ఈ రెండు సినిమాలలో మహేష్ నీ చాలా వైవిధ్యంగా చూపించడం జరిగింది. దీంతో వస్తున్న ఈ మూడు సినిమాలో మహేష్ బాబుని త్రివిక్రమ్ ఎలా చూపించాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా తర్వాత జక్కన్న దర్శకత్వంలో మహేష్ సినిమా చేయనున్నారు. రాజమౌళితో జయబోయే సినిమాకి సంబంధించిన ప్రకటన తన తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు ప్రకటించాలని మహేష్ సెంటిమెంట్ గా భావించి రాజమౌళి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన కూడా ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ముందుగా మాత్రం ఉగాది పండుగనాడు త్రివిక్రమ్ సినిమా టైటిల్ తో కూడిన పోస్టర్ రానున్నట్లు సమాచారం.


Share

Related posts

Prashanth varma: ఆ దర్శకుడు ఈసారి 10 మంది హీరోయిన్లతో సినిమా తీస్తాడట.. హీరో ఒక్కడేనా?

Ram

Intinti Gruhalakshmi: తులసి, సామ్రాట్ ను విడగొట్టటానికి లాస్య అదిరిపోయే స్కెచ్..!

bharani jella

కూతుర్ని తలుచుకొని నాగబాబు ఎమోష‌న‌ల్ .. వైరల్‌గా మారిన పోస్ట్!

Teja