18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News సినిమా

RRR: రాజమౌళికి మరో ప్రతిష్టాత్మక హాలీవుడ్ అవార్డు ఆస్కార్ కి మరింత దగ్గరగా “RRR” ..!!

Share

RRR: దిగ్గజ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి పేరు సినిమా ప్రపంచంలో మారుమగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి సినిమాలకు మంచి డిమాండ్ పెరిగింది. భారతీయ చలనచిత్ర రంగం అంటే ఇప్పుడు రాజమౌళి గురించి మాట్లాడుకునే పరిస్థితి నెలకొంది. కారణం జక్కన్న సినిమాలు తీసే విధానం. రాజమౌళి టేకింగ్ కి హాలీవుడ్ ప్రేక్షకులు సైతం థియేటర్ లో కుర్చీలో కూర్చుని మరీ చప్పట్లు కొట్టేస్తున్నారు. బాహుబలి 2, RRR రెండు సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ₹1000 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి పేరు సంపాదించాయి.

newyork film critic cirlce award won director ss rajamouli
RRR

“RRR” అయితే స్ట్రీమింగ్ విషయంలో నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాగా అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమా ద్వారా రాజమౌళి అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు అంతర్జాతీయ వారోత్సవాలకు ఇండియాలో ఏ దర్శకుడుకు రాని ఆహ్వానాలు జక్కన్నకు అందుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ప్రముఖ హాలీవుడ్ పత్రికలకు.. మీడియాకు ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు కూడా రాజమౌళి ఇస్తున్నాడు. న్యూయార్క్ దినపత్రికలో ఫ్రంట్ పేజీలో రాజమౌళి గురించి ప్రత్యేకమైన కథనం కూడా పబ్లిష్ అయ్యింది. ఇదిలా ఉంటే మరో ఫీట్ జక్కన్న అందుకున్నాడు.

newyork film critic cirlce award won director ss rajamouli
RRR

విషయంలోకి వెళ్తే రాజమౌళికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) RRR సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళిని ఎంపిక చేసింది. ప్రముఖ హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ సభ్యులుగా ఉన్న NYFCC 1935లో ఏర్పడింది. ఈ అవార్డును హాలీవుడ్ కి చెందిన వాళ్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తారు. ఈ అవార్డు రాకతో ఆస్కార్ కి “RRR” మరింత దగ్గరైనట్లే అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా భారత్ నుంచి ఈ NYFCC అవార్డు పొందిన ఏకైక వ్యక్తి జక్కన్నే.


Share

Related posts

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

sekhar

Anchor Ravi Wife Nithya:యాంకర్ రవి ఇంట్లో ఆ విధంగా ఉంటాడా..అసలు విషయం బయట పెట్టిన రవి భార్య నిత్య!

Teja

ఈ ఒక్క ఆయింట్ చాలు రకుల్ రెడ్ హ్యాండెడ్ గా దొరికింది కదా..?

GRK