పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ కలిసి 8ఏళ్ల క్రితం ‘గబ్బర్ సింగ్’తో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పవన్ కు పదేళ్ల తర్వాత భారీ బ్లాక్ బస్టర్ వస్తే హరీశ్ శంకర్ బ్లాక్ బస్టర్ డైరక్టర్ అయిపోయాడు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా కన్ఫర్మ్ అయింది. ఈ సినిమా త్వరలో షూటింగ్ కు వెళ్లాల్సింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంతో అర్ధం కాని పరిస్థితి. ఈ గ్యాప్ లో హరీశ్ వేరే సినిమా చేస్తాడా.. ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తాడా అనే వార్తలు రౌండ్ అవుతున్నాయి.
హరీశ్ మాత్రం ప్రస్తుతం వేరే కమిట్ మెంట్స్ పెట్టుకోనని సన్నిహితుల వద్ద అన్నట్టు తెలుస్తోంది. పవన్ సినిమా తర్వాతే మరో సినిమా అంటున్నాడని టాక్. ఈ వార్తతో పవన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. హరీశ్ పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టి పెడితే మళ్లీ మ్యాజిక్ ఖాయం అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. దువ్వాడ జగన్నాధమ్, గద్దలకొండ గణేశ్ సినిమాలతో వరుస సక్సెస్ లతో ఉన్నాడు హరీశ్.
ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్, క్రిష్ మూవీస్ షూటింగ్స్ లో ఉన్నాడు. పరిస్థితుల్లో మార్పులు రాకపోతే ఈసరికి వకీల్ సాబ్ వచ్చి రెండు నెలలైపోయేది. కానీ.. ఆ షూటింగ్ ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో అర్దం కాని పరిస్థితి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!