Tollywood: మహమ్మారి కరోనా తీసుకొచ్చిన కష్టలకి దాదాపు రెండు సంవత్సరాలపాటు పెద్ద హీరోల మూవీలు థియేటర్ లో పడని పరిస్థితి. అయితే ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి నుండి కేసులు తగ్గడంతో ఒక్కసారిగా విడుదల కావాల్సిన సినిమాలు మొత్తం.. వరుసపెట్టి విడుదలయ్యాయి. ప్రభాస్ నటించిన “రాధేశ్యం”, పవన్ “భీమ్లా నాయక్”, పాన్ ఇండియా బిగ్ సినిమాస్ “RRR”, “KGF 2”, “ఆచార్య”…. మరికొద్ది రోజుల్లో “సర్కారు వారి పాట”.. ఈ రీతిగా వరుసపెట్టి సినిమాలు విడుదలయ్యాయి. పరిస్థితి ఇలా ఉంటే .. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి వాతావరణం కనబడటం లేదు. కానీ మళ్లీ పెద్ద సినిమాలు… ఆగస్టు నుండి విడుదల అవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విజయ్ దేవరకొండ లైగర్ రిలీజ్ కొన్ని చిన్న సినిమాలు. షూటింగ్ కి సంబంధించి చూస్తే …గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా.. షూటింగ్ ప్రస్తుతం చాలా శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా వచ్చే దసరాకి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక సెప్టెంబర్ నెలలో యాష్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. జూన్ మాసం నుండి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగు పట్టాలెక్కనుందట.
అక్టోబర్ మాసంలో అంతా కుదిరితే క్రిష్ దర్శకత్వంలో.. పవన్ నటించిన హరిహర వీరమల్లు విడుదల కానుంది. ర తర్వాత హరీష్ శంకర్ “భగత్ సింగ్ భవదీయుడు” షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక నవంబర్ నెలలో చాలా వరకు ఇండస్ట్రీలో కుర్ర హీరోల సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఇక డిసెంబర్ విషయానికి వస్తే బన్నీ పుష్ప రెండో భాగం సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఫోటో వచ్చే సంక్రాంతికి చూసుకుంటే త్రివిక్రమ్ మహేష్ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా… శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న ఇండియా బిగ్ బడ్జెట్ సినిమా…ఇంకా ప్రభాస్ సలార్.. విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!