ఇక్కడ అక్కినేని హీరోయిన్ అంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలైన నాగచైతన్య, అఖిల్ అక్కినేనిలతో నటించిన హీరోయిన్ అనే అర్థం. రీసెంట్ టైమ్స్‌లో ఈ ఇద్దరు హీరోలతో నటించిన హీరోయిన్ నిధి అగర్వాల్. ఈమె ఇప్పుడు రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’లో నటిస్తుంది. ఇప్పటి వరకు తెలుగులోనే నటించిన నిధి, తర్వలోనే కోలీవుడ్ రంగప్రవేశం చేస్తుంది. అందుకు సంబంధించిన పార్మాలిటీస్ కూడా పూర్తి అయ్యాయని అంటున్నారు. వివరాల్లోకెళ్తే.. తెలుగు మూలాలున్న తమిళ హీరో, ఎడిటర్ మోహన్ తనయుడు జయం రవి హీరోగా 25వ సినిమా రూపొందుతోంది. లక్ష్మణ్ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటించనున్నారు.
previous post
next post