NewsOrbit
న్యూస్ సినిమా

‘జుంబారే జుమ్ జుంబారే’ రీమేక్ సాంగ్ లో నిధీ అగర్వాల్ హైలెట్ ..!

టాలీవుడ్ లో ఇంకా తన లక్ ని పరీక్షించుకుంటున్న హీరోయిన్ నిధీ అగర్వాల్. మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధీ ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య నటించిన సవ్య సాచి సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాపయినా మళ్ళీ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ఞు సినిమాలో అవకాశం అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ అక్కినేని హీరోలతో సినిమాలు చేసిన నిధీ కి సక్సస్ లు దక్కలేదు. అయితే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫస్ట్ సక్సస్ ను అందుకుంది. దాంతో ఒక్కసారిగా నిధీ అగర్వాల్ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది. కాని అవకాశాలే రాలేదు.

ఒక మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో నిధీ అగర్వాల్ కి సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనళ్లుడు.. ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ డెబ్యూ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాను ‘భలే మంచి రోజు’ ‘శమంతకమణి’ ‘దేవదాస్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సగభాగం టాకీ పార్ట్ కంప్లీటయిందట.

ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా గల్లా అశోక్ నటిస్తున్న తాజా చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో సాంగ్ ని రిలీజ్ చేసాడు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యమలీల’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘జుంబారే జుమ్ జుంబారే’ అనే పాటను అశోక్ గల్లా తన సినిమా కోసం రీమేక్ చేసాడు. ఈ సాంగ్ లో తాత గారిని అనుకరించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సాంగ్ లో నిధీ స్పెషల్ అట్రాక్షన్ గా అనిపిస్తుంది. అంతేకాదు తన గ్లామర్ తో ఈ సాంగ్ లో బాగా హైలెట్ అవుతుందని చెప్పుకుంటున్నారు.

Related posts

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju