రామ్, పూరి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్లో `దిమాక్ ఖరాబ్… ` అనే సాంగ్ ను చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. వందమంది డ్యాన్సర్స్ తో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తోన్న ఈ సాంగ్ ను కాసర్లశ్యామ్ రాశారు. ఈ సాంగ్ తెలంగాణ యాసలో సాగుతుంది. ఈ సాంగ్ లో నిధి అగర్వాల్ స్టిల్ ను విడుదల చేశారు. వైబ్రేంట్ కాస్ట్యూమ్స్ లో ఉన్న నిధి లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. రెడ్ డ్రెస్ లో నిధి లుక్ హాట్ గా ఉంది. రీసెంట్ గా సాంగ్ సెట్ ను డైరెక్టర్ సుకుమార్ విజిట్ చేసి సరికొత్త స్టైల్లో ఉన్న రామ్ లుక్ ను అప్రిషియేట్ చేయడం విశేషం.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!