Jonnalagadda Chaitanya Second Marriage: మెగా డాటర్ నిహారిక గుంటూరు జిల్లాకి చెందిన జొన్నలగడ్డ చైతన్య కి 2020 డిసెంబర్ నెలలో వివాహం జరిగింది. అయితే వివాహం జరిగి కనీసం రెండు సంవత్సరాలు గడవకముందే ఇద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. అప్పట్లో నిహారిక పెళ్లి రాజస్థాన్ లో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా సమయంలో ప్రభుత్వ ఆంక్షలు విధించడంతో కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య నాగబాబు చాలా అంగరంగ వైభవంగా నిహారిక పెళ్లి జరిపించారు. అయితే ఇటీవల ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అధికారికంగా విడాకులు తీసుకోవడం జరిగింది. విడాకులు తీసుకోకముందు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొన్నాలపాటు ఎవరికి వారు జీవించిన గాని ఈ ఏడాదిలో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
విడాకుల అనంతరం నిహారిక మళ్లీ యధావిధిగా సినిమా ఇండస్ట్రీలో బిజీబిజీగా గడుపుతూ ఉంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తూ నిర్మాణ రంగంలో కూడా రాణిస్తూ ఉంది. అంతేకాదు విడాకులు అనంతరం సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. రకరకాల హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఉంది. అయితే ఈ నిహారిక విడాకులు విషయంలో చైతన్య చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఈ క్రమంలో ముంబైలో కొన్నాళ్లపాటు మెడిటేషన్ సెంటర్లో కూడా జాయిన్ అయ్యాడు.
అలా ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తూ విదేశాలలో విహారయాత్రలు చేస్తూ… ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. అయితే రెండో పెళ్లి చేసుకోకూడదు అని భావించిన జొన్నలగడ్డ చైతన్య ఇంట్లో సభ్యులు… ఇటీవల ఒత్తిడి చేయడంతో రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అంట. అంతేకాదు తమ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉన్న ఐపీఎస్ అధికారి కూతురితో చైతన్య రెండో పెళ్లి జరగనున్నట్లు ఆల్రెడీ ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారని త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.