రీసెంట్ గా మెగా ఫ్యామిలీలో సందడి అంతా నిహారిక చుట్టూనే తిరిగింది. పెళ్లి, రిసెప్షన్, పెళ్లికి ముందు పార్టీలు, సంగీత్, బ్యాచిలర్ పార్టీ.. అన్నింటిలో నిహారిక మెరిసిపోయింది. ముద్దుల చెల్లెలి పెళ్లి సంబరాన్ని అంబరాన్నంటేలా చేశాడు వరుణ్ తేజ్. తమ చేతుల్లో పెరిగిన చిట్టి తల్లిని చైతన్య చేతిలో పెడుతున్నామని మురిసిపోయారు మెగాస్టార్. నాగబాబు ఎమోషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సందడిలోనే డిసెంబర్ 18న బర్త్ డే జరుపుకుంది నిహారిక. పెళ్లికి విలువైన బహుమతులు అందుకున్న నిహారిక పెళ్లి తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజుకి భర్త చైతన్య నుంచి అద్భుతమైన గిఫ్ట్ అందుకుంది.
నిహారిక అల్లరి, సందడి, తన మనసు తెలిసి మనువాడిన భర్తగా చైతన్య ఆమెకు ఓ కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చాడు. గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్క పిల్లను తొలి బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వడంతో నిహారిక మురిసిపోతోంది. దానికి ‘బజ్’ అని పేరు కూడా పెట్టుకుంది. ‘వెల్ కమ్ టు మై హార్ట్ బజ్’ అని నిహారిక.. ‘మీట్ బజ్ జొన్నలగడ్డ’ అని వెచ్చగా నిద్రపోతున్న బజ్.. దానిని చూస్తూ మురిసిపోతున్న నిహారిక పిక్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు ఇద్దరూ. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.
ఈ పోస్టులకు కల్యాణ్ దేవ్, లావణ్య త్రిపాఠి, అల్లు శిరీష్.. లైక్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఏం బ్రీడ్ ఇది చెప్పవా.. అంటే అల్లు శిరీష్ కామెంట్ చేశాడు. నెటిజన్లు కూడా ‘మోస్ట్ లక్కీయస్ట్ గర్ల్ నిహారిక’, ‘హ్యీపీ బర్త్ డే’, ‘టూ క్యూటీస్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి నిహారిక సందడి పెళ్లి నుంచి పుట్టినరోజు వరకూ కొనసాగుతూనే ఉంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. టీటౌన్ లో నిహారిక పెళ్లిసందడే హాట్ టాపిక్ అయింది.