Niharika:మెగా వారసురాలు కొణిదెల నిహారిక పరిచయం అక్కర్లేదు. మోడలింగ్ తరువాత సినిమాలలో అడుగు పెట్టిన ఈ అమ్మడు ఆరిస్టుగా మంచి పేరే తెచ్చుకుంది. ఇక ఆ తరువాత పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే నిహారిక సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అయితే తన తాజా కార్యకలాపాలను పంచుకోవడంలో ముందుంటుంది. ఈ క్రమంలో తాజాగా నిహారిక, ఓ కొత్త ఫోటోతో నెటిజెన్లలను షాక్ కి గురి చేసింది.
నిహారిక కొత్త అవతారం ఎత్తింది. అవును.. పొడవాటి ఆమె హెయిర్ ని కత్తిరించుకున్న దృశ్యం మనం ఆ ఫొటోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా లైక్ చేస్తూ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఓ వైపు తన భర్త కూడా ఆమెతో పాటు సోషల్ మీడియాలో మంచి చురుగ్గా పాలు పంచుకుంటాడు. అతను కూడా తన ఫొటోలతో పాటు నిహారిక ఫోటోలను జత చేస్తూ తమ అభిమానులకు అందుబాటులో ఉంటాడు. ఈ క్రమంలో నిహారిక కుండలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ వున్న ఫోటోలను తాను తీసి పోస్టు చేశాడు. అవి కూడా వైరల్ అయ్యాయి.
మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక వెబ్ సిరీస్‌లు, సినిమాలతో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన చిత్రాలను పంచుకోవడానికి ఇష్టపడే నటీమణులలో నిహారిక ఒకరని చెప్పుకోవచ్చు. అయితే ఆమె పోస్ట్ చేసిన తాజా పోస్టు చూసిన నెటిజన్లు ఆమెని నెక్స్ట్ సినిమా ఎపుడని అడుగుతున్నారు. తరువాత రాబోయే సినిమా గెటప్ అని కొందరు కామెంట్స్ చేయగా, మరికొంతమంది సమ్మర్ కి అలా ఫ్రీ గా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
Acharya: కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. రామ్ చరణ్(Ram Charan) ఫస్ట్ టైం లాంగ్ లెన్త్ రోల్…
Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…