NewsOrbit
సినిమా

Ravi Teja-Nikhil: ర‌వితేజ ఉంటే నాకేంటి.. హీరో నిఖిల్ డేరింగ్ స్టెప్?!

Ravi Teja-Nikhil: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌కే స‌వాల్ విస‌ర‌బోతున్నాడు. ర‌వితేజ ఉంటే నాకేంటి అన్న‌ట్లుగా నిఖిల్ డేరింగ్ స్టెప్ వేసేందుకు సిద్ధం అయ్యాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నిఖిల్ చేస్తున్న చిత్రాల్లో `18 పేజెస్` ఒక‌టి. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీసుందర్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌ టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేస్తున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల విడుద‌ల‌ వాయిదా ప‌డింది.

అయితే ఇప్పుడీ మూవీని జూన్ 17న రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఓ పోస్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని అనౌన్స్ కూడా చేయ‌నున్నార‌ని టాక్ న‌డుస్తోంది. అయితే ఇప్పుడిదే విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే, ర‌వితేజ న‌టించిన `రామారావు ఆన్ డ్యూటీ` సినిమాను జూన్ 17వ తేదీన విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లె ప్ర‌క‌టించారు.

శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా అలరించనున్నారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. భారీ అంచ‌నాలు ఉన్న ఈ సినిమాకు పోటీగా నిఖిల్ దిగితే.. నెగ్గ‌గ‌ల‌డా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

 

author avatar
kavya N

Related posts

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri