యువ కథానాయకుడు నిఖిల్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న కె.ఇ.ప్రతాప్‌కు తన సపోర్ట్‌ను అందిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన నేపథ్యంలో నిఖిల్ ఓ వీడియో బైట్‌ను విడుదల చేశారు. ఆ వీడియోలో నిఖిల్ మాట్లాడుతూ “నాపై ఓ రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఆ వార్తలన్నీ అవాస్తవాలు. నేను ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వాడిని కాను. అయితే నాకు పాతికేళ్లుగా తెలిసిన మా అంకుల్ కె.ఇ.ప్రతాప్‌గారు డోన్ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఆయనకు విషెష్ చెప్పడానికి వెళ్లాను. అక్కడున్న ప్రజలకు ఆయనకు ఓట్లు వేయాలని చెప్పాను. ప్రతాప్‌గారు ఎంత మంచి వ్యక్తో నాకు తెలుసు. ఎన్నో మంచి పనులు చేశారు. పార్టీలకు సంబంధం లేకుండా మంచివారు ఎక్కడున్నా మనం సపోర్ట్ చేయాలి. ఈసారి నాకు తెలిసిన చాలా మంది మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు. వారందరినీ నేను సపోర్ట్ అందిస్తాను. నా వల్ల వాళ్లకి ఓట్లు వచ్చేస్తాయని కాదు.. నాకు అంత కెపాసిటీ లేదని కూడా తెలుసు. ఓ యంగ్ ఇండియన్‌గా ఏదో చేసేయాలని తాపత్రయంతో కృషి చేస్తున్నాను. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆయుధం. దాన్ని కరెక్ట్‌గా వాడుదాం. మంచి వ్యక్తిని చూసి ఓటేయండి“ అన్నారు.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!