నిఖిల్ సిద్దార్థ్… కెరీర్ స్టార్టింగ్ లో ఒడిదుడుకులు ఎదురుకున్నా కూడా రీసెంట్ గా మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి వరస హిట్స్ కొట్టి క్లోజ్ అయిపోయే ప్రమాదంలో ఉన్న కెరీర్ ని సేఫ్ జోన్ లోకి తెచ్చుకున్నాడు. నిఖిల్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మంచి విషయం ఉంటుందనే కాన్ఫిడెన్స్ లో సినీ అభిమానులు ఉంటారు.. అయితే ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత నిఖిల్ కి సరైన హిట్ లేదు.. బ్యాక్ టు బ్యాక్ 2 ఫ్లాప్స్ ఫేస్ చేశాడు.
ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని కాస్త టైం తీసుకొని చేస్తున్న సినిమా ముద్ర… ఫస్ట్ లుక్, టైటిల్ లోగో తప్ప చిన్న టీజర్ కూడా రిలీజ్ చేయని ఈ సినిమా ఫేక్ సర్టిఫికెట్స్ చుట్టూ తిరుగుతుంది.. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.. ముద్రలో నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు.. కనిదన్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కథే ప్రధాన బలం… నిఖిల్ హిట్ కొట్టడం ఖాయం అనుకుంటున్న టైములో.. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిలే అవుతూనే ఉంది.. నిజానికి ఈపాటికే రిలీజ్ కావాల్సిన ముద్రకి మొదట్లో టైటిల్ కి సంబందించిన వివాదాలు ఎదురయ్యాయి, దాంతో ముద్ర కాస్త నిఖిల్ ముద్రగా మారింది.
ముందుగా చెప్పిన టైం ప్రకారం అయితే ముద్ర సినిమా అక్టోబర్ లోనే రిలీజ్ కావాలి.. కానీ అది కాస్త డిసెంబర్ కి మారింది.. డిసెంబర్ నుంచి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో మూడు నెలల క్రితం విడుదల కావాల్సిన సినిమాకి ఇంకా అయిదు రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉండడంతో ఏంటో నిఖిల్ కే తెలియాలి. త్వరలో విడుదల తేదీని చెప్తామని ముద్ర టీమ్ అంటున్నారు కానీ చెప్పిన టైంకి ముద్ర సినిమా రావడం అనుమానంగానే మారింది… ఫిబ్రవరికైనా ముద్ర సినిమా వస్తుందా లేక మళ్లీ వాయిదా పడుతుందా అనే క్లారిటీ ఎవరికీ లేదు. ఇప్పటికైతే అలా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయిన చిత్రాలు బాక్సాఫీస్ దెగ్గర అందరినీ మెప్పించి ఆడిన దాఖలాలైతే తెలుగులో పెద్దగా లేవు… మరి చరిత్రని నిఖిల్ తిరగరాసి హిట్ అందుకుంటాడా లేక ఫ్లాప్ ఇచ్చి నిరాశపరుస్తాడా అనేది చూడాలి.