యువ కథానాయకుడు నితిన్, జనసేనాని పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. అలాగే పవన్ కల్యాణ్ కూడా నితిన్ అంటే ప్రత్యేకాభిమానాన్ని కనపరుస్తుంటారు. తన ఇంటి హీరోల ఫంక్షన్స్ కంటే నితిన్ సినిమా ఫంక్షన్స్కే పవన్ ప్రాధాన్యమిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నితిన్ అంటే పవన్‌కు అంత ఇష్టం. రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా నితిన్ ఆయన్ను కలుసుకోలేకపోతున్నాడు. అయితే తన అభిమాన హీరో, నాయకుడు కోసం నితిన్ సోమవారం పాతిక లక్షల రూపాయల విరాళాన్ని అందించారు.
సోమవారం భీమవరంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, పవన్‌కల్యాణ్‌ను కలిసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేయడమే కాకుండా, చెక్కును కూడా అందించారు. దీనిపై పవన్‌కల్యాణ్ స్పందించారు. “సోదరుడు నితిన్ నా ఆరోగ్యం గురించి వాకబు చేసినందుకు ఆనందంగా ఉంది. ఎంతో అభిమానంతో జనసేనకు పాతిక లక్షల రూపాయల విరాళాన్ని కూడా అందించారు. నితిన్, సుధాకర్‌రెడ్డిగారికి కృతజ్ఞతలు“ అని తెలిపారు పవన్.
previous post
next post