సినిమా

Nithya Menen: నిత్యామీనన్‌కి అలా చేస్తే చెడ్డ చిరాక‌ట‌..వామ్మో ఇలాగైతే క‌ష్ట‌మే!

Nithya Menen Cute Images
Share

Nithya Menen: నిత్యామీనన్‌.. ఈ బూరె బుగ్గల బాబ్లీ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన `అలా మొదలైంది` సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన నిత్యా మీన‌న్.. మొద‌టి చిత్రంలోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన నిత్యా.. ఎక్స్‌పోజింగ్‌కు ఆమ‌డ దూరంలో ఉంటూ త‌న‌దైన అందం, అభిన‌యంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌కు పెంచుకుంది.

నిత్యా మీన‌న్ గొప్ప న‌టే కాదు సింగ‌ర్ కూడా. అలాగే ఇటీవ‌ల విడుద‌లైన `స్కైలాబ్‌` సినిమాతో నిర్మాత‌గానూ అవ‌తార‌మెత్తింది. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఇందులో సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబ‌ర్ 4న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.

 nithya menen interests comments on herself
nithya menen interests comments on herself

ఇదిలా ఉంటే.. నిత్యామీన‌న్‌కి ఆత్మాభిమానమం చాలా అంటే చాలా ఎక్కువ‌. త‌న‌ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అస్స‌లు త‌ట్టులేద‌ట‌. ఈ టైమ్‌లో చెడ్డ చిరాకు వ‌చ్చేస్తుంద‌ట‌. అలాగే త‌న‌ను ఎవరైనా అవమాన పరచాలని ప్రయత్నిస్తే వారికి గట్టిగా సమాధానం ఇస్తాన‌ని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో నిత్యా మీన‌న్ చెప్పుకొచ్చింది. దాంతో ఆమె మాట‌ల‌కు కొంద‌రు నెటిజ‌న్లు ఇలాగైతే నిత్యాతో క‌ష్ట‌మే అంటూ కామెంట్స్ చేశారు.

కాగా, నిత్యా మీన‌న్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జోడీగా `భీమ్లా నాయ‌క్‌` చిత్రం చేస్తోంది. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. మ‌ల‌యాళంలో హిట్టైన అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రానా ద‌గ్గుబాటి కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. ఆయ‌న‌కు జోడీగా సంయుక్త‌ మీన‌న్ న‌టిస్తోంది. సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. అయితే ఫిబ్రవరి 25న భీమ్లా నాయ‌క్ ప్రేక్ష‌కుల ముందు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.


Share

Related posts

Ravi Teja: మాస్ మహారాజ సంచలన నిర్ణయం!

Ram

Ravi teja : రవితేజ – ఇస్మార్ట్ బ్యూటీ కాంబో మళ్ళీ రిపీట్ ..?

GRK

ప్రభాస్ ఆదిపురూష్ కి ఇండియా నెంబర్ 1 హీరోయిన్ – ఎంత అడిగిందో తెలుసా !!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar