సినిమా

Nithya Menen: యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన నిత్యామీనన్..ఫ‌స్ట్ వీడియో వైర‌ల్‌!

Share

Nithya Menen: నిత్యా మీనన్ అంటే తెలియ‌ని వారుండ‌రు. మలయాళ కుటుంబంలో జన్మించిన ఈ అందాల భామ‌.. నాని హీరోగా తెర‌కెక్కిన ` అలా మొదలైంది` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రంతో త‌న‌దైన అందం, అభిన‌యంతో పాటు స‌హజ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మిస్మ‌రైజ్ చేసిన నిత్యా.. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసింది.

అలాగే మ‌రోవైపు కన్నడ, తమిళ్‌, మలయాళ భాషల్లోనూ ప‌లు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. మంచి సింగ‌ర్‌గానూ త‌నేంటో ఫ్రూవ్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా నిత్యా మీన‌న్ యూట్యూబ్‌లోకి అడుగు పెట్టి కొత్త ఛానెల్‌ను స్టార్ట్ చేసింది. `నిత్య అన్‌ఫిల్టర్డ్` పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ అనౌన్స్ చేసిన ఈ బ్యూటీ.. తన 12ఏళ్ల సినీ కెరీర్‌కి సంబంధించిన విషయాలను త‌న ఫస్ట్ వీడియోలో పంచుకుంది.

దీంతో ఈ వీడియో కాస్త వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు, అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తూ.. ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. ఇక నిత్యా మీన‌న్ యూట్యూబ్‌లోకి వ‌చ్చిందో.. లేదో.. ఆమె స‌బ్‌స్క్రైబ‌ర్ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేవ‌లం ఒక్క రోజులోనే ఆమె 7.37కె స‌బ్‌స్క్రైబ‌ర్స్‌ను సొంతం చేసుకుంది. ముందు ముందుకు ఆ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి.

కాగా, కెరీర్ స్టార్టింగ్ నుంచీ ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవ‌లం న‌ట‌న ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే ఎంచుకుంటూ వ‌చ్చిన నిత్యా మీన‌న్.. చివ‌ర‌గా `భీమ్లా నాయ‌క్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ మూవీలో త‌న హైప‌ర్ యాక్టివ్‌తో ఆక‌ట్టుకున్న నిత్యా.. ప్ర‌స్తుతం ఓ సింగింగ్ షోకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. అలాగే ప‌లు సినిమాలు చేస్తోంది.


Share

Related posts

Mahesh : మహేష్ సర్కారు వారి పాట..గోవాలో భారీ యాక్షన్ సీన్స్

GRK

బొంబాట్` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Siva Prasad

ప్రభాస్ మల్టీప్లెక్స్.. ఆసియాలోనే పెద్ద సిల్వర్ స్క్రీన్

Siva Prasad