Nithiin: తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నితిన్ తెలుగులో పలు సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. తరువాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో మరి ఫామ్ లోకి వచ్చాడని చెప్పవచ్చు. తెలుగులో యువ హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నితిన్ గత ఏడాది ఓ ఇంటివాడైన సంగతి మనకు తెలిసిందే.
2020 జూలై నెలలో తాను ప్రేమించిన చిన్ననాటి స్నేహితురాలు షాలిని కందుకూరిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.కరోనా సమయంలో పెళ్లి కావడంతో కేవలం కొంత మంది సమక్షంలో మాత్రమే నితిన్ పెళ్లి జరిగింది. అప్పట్లో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. లాక్ డౌన్ అనంతరం పలు సినిమాలలో ఎంతో బిజీగా గడిపిన నితిన్ తాజాగా చెక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదే కాకుండా కీర్తి సురేష్ జంటగా “రంగ్ దే” సినిమాతో మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి రాబోతున్నారు.
నితిన్ రంగ్ దే ప్రమోషన్స్:
నితిన్ నటించిన రంగ్ దే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నితిన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే నితిన్ తన వైవాహిక జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉండేదో ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు. పెళ్లి తరవాత తన జీవితం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నితిన్ తెలియజేశారు. పెళ్లికాకముందు సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఇంటికి వచ్చి షాలినితో ఫోన్ మాట్లాడుతూ రిలాక్స్ అయ్యే వాడినని తెలిపాడు.పెండ్లి తర్వాత ఇంటికి తిరిగొచ్చిన తర్వాత షాలిని కంపెనీని వీడలేకపోతున్నానంటూ ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. మీ సినిమాలపై మీ భార్య రియాక్షన్ ఎలా ఉంటుంది అని అడగగా.. ఇద్దరం కలిసి టీవీ షోలు, వెబ్ సిరీస్ లు చూస్తుంటాం అంటూ నితిన్ తెలియజేశారు.