సినిమా

SVP: మహేష్ కి హిట్ పడితే కుళ్ళిపోతున్న హీరోలు.. సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు..!!

Share

SVP: మహేష్ నటించిన “సర్కారు వారి పాట” సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే. మే 12వ తారీకు రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే కరోనా వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులు రావడం తెలిసిందే. ఒక హీరో సినిమాని మరొక హీరో ప్రమోట్ చేసే దిశగా సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో అందరి కంటే ముందు మహేష్ ఉన్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భీమ్లా నాయక్, ఆచార్య, పుష్ప, RRR, అఖండ సినిమాలు విడుదల అయ్యాక మహేష్ బాబు.. తన అభిప్రాయాలు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ గా కామెంట్ రూపంలో తెలపడం జరిగింది.

No Hero Support Mahesh SVP Movie

కానీ మహేష్ నటించిన “సర్కారు వారి పాట” హిట్ టాక్ తో దూసుకుపోతున్న… ఇండస్ట్రీలో ప్రభాస్ తప్ప మారే హీరో సోషల్ మీడియాలో రెస్పాండ్ కాలేదు. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నటించిన “ఆచార్య” కి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. కనీసం “ఆచార్య” సినిమా యూనిట్ కూడా.. మహేష్ “SVP” గురించి ఏమాత్రం రియాక్ట్ కాలేదు. పైగా ఉద్దేశపూర్వకంగా కొంతమంది హీరో అభిమానులు.. నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని “సర్కారు వారి పాట” నిర్మాతలు కూడా సోషల్ మీడియాలో తెలియజేయటం జరిగింది. ఈ పరిణామంతో సోషల్ మీడియాలో కామన్ సినీ లవర్స్… ఇండస్ట్రీలో మహేష్ కి హిట్ పడితే మిగతా హీరోలు కుళ్లుకుంటున్నారు.. అందువల్లే “సర్కారు వారి పాట”కి ఎవరు రెస్పాండ్ కాలేదు.. సోషల్ మీడియా లో అడ్డంగా బుక్కయ్యారు అని అంటున్నారు.

 

కరోనా వచ్చాక ఒకరి సినిమాలను మరొకరు ప్రోత్సహించే రీతిలో మహేష్ ముందుకొచ్చిన గాని ఆయన సినిమాకి మిగతా స్టార్ హీరోల నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవటం ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా మహేష్ “సర్కారు వారి పాట” బ్లాక్ బస్టర్ కావటంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సినిమా యూనిట్ కూడా సక్సెస్ సంబరాలు చేసుకుంటూ ఉంది.


Share

Related posts

బిగ్ బాస్ అవినాష్ అదరహో : జీవిత పాఠాలు ఎన్నో

Special Bureau

Pooja hegde : పూజా హెగ్డే కోలీవుడ్ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్..!

GRK

Prabhas Heroine : నోరు జారిన ప్రభాస్ హీరోయిన్.. ఫక్కుమన్న నెటిజన్లు!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar