రానాకు ఆరోగ్యం సెట్ అవుతుందా?

రానా ద‌గ్గుబాటి పాత్ర‌ల కోసం ఎంత‌టి రిస్క్ అయినా తీసుకునే న‌టుల్లో ఒక‌రు. ఆయ‌న చేసిన పాత్ర‌లే ఆయ‌న‌కు ఇప్పుడు స‌మ‌స్య‌ను తెచ్చిపెట్టాయి. `బాహుబ‌లి` చిత్రంలో భ‌ల్లాల‌దేవ పాత్ర కోసం రానా వెయిట్ పెర‌గ‌డం.. వెంట‌నే మ‌రో సినిమా కోసం త‌గ్గ‌డం వంటి ప‌నుల వ‌ల్ల ఆయ‌న ఆరోగ్యం పాడైంది. కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. కిడ్నీని మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఆప‌రేష‌న్ చేయ‌బోతున్నార‌ని కూడా వార్త‌లు వినిపించాయి. అనారోగ్యం కార‌ణంగా కొన్ని రోజుల పాటు రానా సినిమాల‌కు దూరంగా ఉంటున్న్నాన సంగతి తెలిసిందే. నిపుణులైన వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇప్పుడిప్పుడే రానా ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇంతే స్పీడ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఉంటే మాత్రం కిడ్నీ ఆప‌రేష‌న్ చేయాల్సిన అవ‌స‌రం లేదని డాక్ట‌ర్స్ అంటున్నార‌ట‌ డాక్టర్స్. మరో పక్క ఇప్పుడిప్పుడే రానా సినిమాల‌తో మ‌ళ్లీ బిజీ కావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. రానా చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి.