సినిమా

Dil Raju: టికెట్ రేట్స్ ఎంత పెంచేసినా కూడా కంటెంట్ ఉంటేనే ఆడుతాయి,లేదంటే లేదు: దిల్ రాజు

Share

Dil Raju: అవును. ఇది అక్షరాలా నిజం. టికెట్ రేట్స్ ఎంత పెంచేసినా కూడా కంటెంట్ ఉంటేనే ఆడుతాయి, లేదంటే లేదు. ఈ విషయం అందరికీ తెలిసినదే. అయితే ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ మీడియా వేదికగా మాట్లాతుతూ ఉటంకించారు. అయితే కొన్ని తెలుగు సినిమాలకు హీరోలే క్రౌడ్ పుల్లర్స్ అని నిరూపిస్తున్నారు. మరికొన్ని సినిమాల విషయంలో అలా జరగడం లేదు. ఉదాహరణకు తీసుకుంటే… పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ‘భీమ్లా నాయక్’ సినిమా యావరేజ్ గా ఉన్నప్పటికీ కాసుల వర్షం కురిపించింది. అయితే మెగాస్టార్ నటించిన ‘ఆచార్య’ మాత్రం బాక్షాఫీస్ వద్ద చతికల పడింది.

No matter how high the ticket rates are, they will play if there is content, or not: Dil Raju
No matter how high the ticket rates are, they will play if there is content, or not: Dil Raju

దిల్ రాజు మాటలు ఇవే:

ఈ సినిమాల ఉదాహరణలే చెబుతూ దిల్ రాజు తాజాగా వ్యాఖ్యానించాడు. హీరో క్రౌడ్ పుల్లర్ అయినా కానీ కంటెంట్ మిస్సయితే డిజాస్టర్ అని ప్రూవ్ చేసిన సినిమా గా ఆచార్యను చెప్పుకోవచ్చని అన్నారు. అలాగే ఈ సినిమాకు థియేటర్లకు రాకపోవడానికి టికెట్ ధరల పెంపు కూడా ఒక బలమైన కారణం అన్నది దిల్ రాజు సహా ఇండస్ట్రీ వర్గాల విశ్లేషణ. మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోలు నటించినా ఈ మూవీ థియేటర్లను జనాలతో పుల్ చేయలేకపోయిందని విమర్శలొచ్చాయి. ఇది దారుణ వైఫల్యం అంటూ విమర్శించిన వారున్నారు. దీనిపై దిల్ రాజు కూడా స్పందించారు.

No matter how high the ticket rates are, they will play if there is content, or not: Dil Raju
No matter how high the ticket rates are, they will play if there is content, or not: Dil Raju

మరింత సమాచారం:

ఈ క్రమంలో దిల్ రాజు ఎఫ్ 3 సినిమా టిక్కెట్ల పెంపు కోసం దరఖాస్తు చేయడం లేదని తెలిపారు. కొన్నాళ్ల క్రితం చిరంజీవి నాయకత్వంలో అగ్ర హీరోలు సహా దిల్ రాజు కూడా టికెట్ పెంపుపై ప్రభుత్వాన్ని కలిసిన మాట వాస్తవమే. చివరికి AP ప్రభుత్వం దిగొచ్చి టికెట్ పెంపునకు అంగీకరించింది. కానీ ఈ పెంపుదల ఆచార్య చిత్రంపై పెద్ద పంచ్ వేసిందని తర్వాత దిల్ రాజు విశ్లేషించాడు. అయితే ఆచార్య పై చూపిన ప్రభావం RRR- KGF 2 చిత్రాలపై ఎందుకని చూపలేదు? అంటూ కొంతమంది విశ్లేషిస్తున్నారు.


Share

Related posts

Parvati Nair Beautiful Clicks

Gallery Desk

Biggboss 4: షో ఆపేయండి.. హెచ్ఆర్సీలో ఫిర్యాదు.. దేవుడా మధ్యలో ఇదేం ట్విస్టు

Varun G

సాంకేతిక‌త మ‌రో కోణంగా `కీ`

Siva Prasad