Acharya: దర్శకుడు రాజమౌళి సినీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా.. ఇప్పటి వరకు అపజయం అన్న పదమే ఆయన హిస్టరీలో నమోదు అయిన దాఖలాలు లేవు. సినిమా, సినిమాకు తన స్థాయిని, టాలీవుడ్ ఖ్యాతిని పెంచుకుంటూ పోతున్న జక్కన్నను ఓ బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం వెంటాడుతూనే ఉంది.
అదేంటంటే.. రాజమౌళితో సినిమా చేశారంటే చాలు ఆయా హీరోల తదుపరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడతాయి. ఇలా ఒకరిద్దరికి కాదు.. ఆయన దర్శకత్వంలో సినిమా చేసిన హీరోలందరికీ ఇదే పరిస్థితి ఎదురైంది. వారి వారి సినిమాలు ఫ్లాఫ్ కావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కానీ అంతా రాజమౌళి సెంటిమెంట్ గానే నమ్ముతుంటారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఈ బ్యాడ్ సెంటిమెంట్ నుంచి ఆచార్యుడు కూడా తప్పించుకోలేకపోయాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం `ఆచార్య`. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `సిద్ధ` అనే కీలక పాత్రను పోషించారు. `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో.. జక్కన్న సెంటిమెంట్ ప్రభావం దీనిపై పడుతుందేమో అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే ఆ అనుమానాలే నిజమైందని అంటున్నారు. నేడు అట్టహాసంగా విడుదల ఆచార్య సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. స్టార్ కాస్ట్, భారీ సెట్టింగ్ ఉన్నా.. కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. కథనంలో మెరుపుల్లేవు. అన్నీ ఊహించినట్టే జరుగుతూ నీరసంగా సాగడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. భారీ అంచనాల నడుము రిలీజ్ అయిన ఈ చిత్రం బాగా నిరాశ పరిచింది.