ఈ హీరోలకు రెమ్యున‌రేష‌న్స్ లేవు


స‌క్సెస్‌కు చాలా ప్రాధాన్య‌త ఉంటుంది. స‌క్సెస్ లేక‌పోతే ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో కొంద‌రి హీరోలు స‌క్సెస్‌కు ఆమ‌డ దూరంలో ఆగిపోయి ఆద‌ర‌ణ లేకుండా ఇబ్బందులు ప‌డుతున్నారు. స‌క్సెస్ లేని హీరోల‌కు మార్కెట్ కూడా స‌రిగ్గా ఉండ‌దు. ఇలాంటి వారితో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు కూడా ఆలోచిస్తుంటారు. ఆ కోవ‌లో మ్యాచో హీరో గోపీచంద్‌తో పాటు యువ క‌థానాయకుడు రాజ్‌త‌రుణ్‌ల‌కు ప్ర‌స్తుతం స‌క్సెస్‌లు లేవు. దీంతో ఈ హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. వీరి సినిమాల‌కు మార్కెట్ ప‌డిపోయింది. దీంతో వీరు ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాల మేకింగ్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అందులో భాగంగా నిర్మాణ వ్య‌యం త‌గ్గించ‌డానికి వీరు రెమ్యున‌రేష‌న్స్ తీసుకోవ‌డం లేద‌ట‌. సినిమా హిట్ అయిన త‌ర్వాత రెమ్యున‌రేష‌న్స్ తీసుకునేలా డీల్ కుదుర్చుకుని సినిమాలు చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.