NTR Birthday: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ వెండితెరపై 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన “అరవింద సమేత వీర రాఘవ” చిత్రం ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా ఒక్కటి కూడా రాకపోవడంతో అభిమానులలో తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ క్రమంలోనే రాజమౌళి సినిమా ప్రకటించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన 30 వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించడంతో ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇప్పటి వరకు అంతా సక్రమంగానే ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేయడంతో ఇప్పటికే పలు సినిమా షూటింగ్, విడుదలను వాయిదా వేసుకున్నాయి. ఈ మహమ్మారి ప్రభావం ఎన్టీఆర్ సినిమా పై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ పుట్టినరోజు:
గత ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజుకు పూర్తిగా లాక్ డౌన్ విధించడంతో ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ఎలాంటి టీజర్, పోస్టర్ కానీ విడుదల కాలేదు. ఈసారైనా తన పుట్టినరోజు “ఆర్ఆర్ఆర్” సినిమా నుంచి లేదా కొరటాల శివ తెరకెక్కించబోయే సినిమా గురించి అయినా సమాచారం వెలువడుతుందని ఎంతోమంది భావించారు. కాకపోతే ఇప్పటి పరిస్థితులు కూడా గతంలో మాదిరి ఉండడంతో ఎన్టీఆర్ పుట్టినరోజు కు “ఆర్ఆర్ఆర్” ఎలాంటి టీజర్ కానీ, పోస్టర్ కానీ విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇకపోతే కొరటాల శివ తెరకెక్కించబోయే సినిమా ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని భావించిన అభిమానులకు కొరటాల శివ కూడా తీవ్ర నిరాశ కల్పిస్తున్నారు.కరోనా కారణంగా షూటింగ్ ప్రారంభం కాని తరుణంలో ఈ సినిమా నుంచి కూడా ఎటువంటి సమాచారం వచ్చే అవకాశం లేదని తెలియడంతో అభిమానులు ఎంతో నిరాశ చెందుతున్నారు.