Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా “హరిహర వీరమల్లు”. మొగలుల సామ్రాజ్య కాలం నాటి స్టొరీ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మూడు విభిన్నమైన పాత్రలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒక పాత్రలో గుర్రపు స్వారీ చేయటంతో పాటు .. యుద్ధం చేసే వీరుడిగా పవన్ నటించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలకు పవన్ … ప్రాచీన యుద్ధ విద్యలు కూడా ప్రత్యేకంగా నేర్చుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. ఇటువంటి తరుణంలో “హరిహర వీరమల్లు” ఒక ప్రత్యేకమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నీ సినిమా మొదట్లో తీసుకోవటం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఈడి కేసులలో అడ్డంగా ఇరుక్కోవడంతో.. సినిమా యూనిట్ ఆమెను ప్రాజెక్టు నుండి తొలగించడం జరిగిందట.
ఈ క్రమంలో ఆమె స్థానంలోకి నోరా ఫాతేహి నీ తీసుకోవడం జరిగింది. త్వరలోనే నోరాకి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు అని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. బ్యాలెన్స్ షూటింగ్ చాలా వరకు యుద్ధ సన్నివేశాలు..అని, ఇందుకోసం ఇప్పటికే పెద్ద మైదానాలు సిద్ధం చేసినట్లు త్వరలోనే.. ఆ లొకేషన్ లలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. అంతా కుదిరితే షూటింగ్ అనుకున్న సమయానికి కంప్లీట్ అయితే.. ఈ ఏడాది దసరా లోనే “హరిహర వీరమల్లు” విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ఒకవేళ ఆలస్యం అయితే గనుక సంక్రాంతి పండుగకు సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.