Allu Arjun: అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ లైన్ అందించిన సినిమా “ఆర్య” అని అందరికీ తెలుసు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బన్ని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం బన్నీ “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు టెన్షన్ పడుతున్నారట. విషయంలోకి వెళితే మొదటి వచ్చిన “ఆర్య” సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే, ఆ తర్వాత వచ్చిన “ఆర్య 2” అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఇదే సీన్ “పుష్ప” లో రిపీట్ అవుతుందేమో అని తెగ టెన్షన్ పడుతున్నారట.
“పుష్ప” రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ 90% కంప్లీట్ కావడంతో ఆగస్టు 13 వ తారీకు సినిమా రిలీజ్ చేయటానికి నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో రెండవ భాగం షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. మొదటి భాగంలో గుబురు గడ్డంతో పక్క ఊర మాస్ గా కనిపించిన అల్లు అర్జున్ రెండో భాగం లో చాలా స్టైలిష్ క్యారెక్టర్లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read More: Pushpa : పుష్పలో లవర్ బాయ్..పార్ట్ 1 లోనా 2లోనా..?
దీంతో రెండో భాగం “పుష్ప” సుకుమార్ “ఆర్య” సెంటిమెంట్ పరంగా అవుతుందేమో అన్న టెన్షన్ లో బన్నీ అభిమానులు ఉన్నారట. ఇదిలా ఉంటే దేవిశ్రీప్రసాద్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్ని మ్యూజికల్ హిట్ కావడంతో .. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోయే పుష్ప సినిమా పాటలు సోషల్ మీడియా లో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో అని అభిమానులు తెగ డిస్కషన్ లు చేసుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?