Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు చాలావరకు సొంత నిర్ణయాలతోనే సినిమాలు ఒప్పుకుంటూ ఉంటారు. సినిమా సెలక్షన్ విషయంలో ఎవరి నిర్ణయం తాను పరిగణలోకి తీసుకోనని అది విజయమైన పరాజయమైన తానే బాధ్యత వహిస్తానని చాలా ఇంటర్వ్యూలలో తెలిపారు. ఇదే సమయంలో తన సినిమా ఫలితాల విషయంలో కుటుంబ సభ్యులు నిర్వాహమాటంగా ఫలితాలు చెబుతారని కూడా చెప్పుకొచ్చారు. అయితే తాజాగా మాత్రం భార్య నమ్రత ఓ ప్రాజెక్టు విషయంలో చేయొద్దని చెప్పడంతో.. మహేష్ తప్పుకోవడం జరిగిందట. ఇప్పుడు ఆ సినిమా కోసం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వెయిట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా మరేదో కాదు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన “యానిమల్”.
“అర్జున్ రెడ్డి” సినిమా విజయం తర్వాత సందీప్ రెడ్డి మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో మహేష్ కి “యానిమల్” కథ వినిపించగా ఓకే కూడా చేయడం జరిగిందట. అయితే ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా నేపథ్యంలో చేయాలని ప్లానింగ్ ఉన్నట్లు చెప్పడంతో నమ్రత కూడా కథ వినగా.. ఈ స్టోరీ వద్దు వేరే స్టోరీ తో రండి అని సున్నితంగా తిరస్కరించడం జరిగిందంట. మనం వేరే సినిమా చేద్దామని సందీప్ రెడ్డికి అప్పుడే మహేష్ దంపతులు మాట కూడా ఇచ్చారట.
ఆ తర్వాత అదే స్టొరీని రణబీర్ కపూర్ కి వినిపించగా మొదటి సిట్టింగ్ లోనే ఓకే చేశారట. కాగా ఇటీవలే “యానిమల్” సినిమా ట్రైలర్ రిలీజ్ కావడం జరిగింది. సినిమాలో చాలా కొత్త తరహా జోనర్ లో రణబీర్ కపూర్ ని చూపించారు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో… రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా పలు భాషల్లో ఈ సినిమా డిసెంబర్ రెండవ తారీకు రిలీజ్ కానుంది.