NTR 30: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇటీవలే సైఫ్ షూటింగ్ లో జాయిన్ కావడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. “NTR 30” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లీకుల బెడద ఎక్కువైపోయింది. మొన్న ఆ మధ్య షూటింగ్ జరుగుతున్న సమయంలో ఫోటోలు లీక్ కావటం తెలిసిందే. రీసెంట్ గా ఓ డైలాగ్ లీక్ అయింది. “సమయం యుద్ధాన్ని కోరినప్పుడు ప్రకృతి తన సారథిని పంపిస్తుంది.
ప్రకృతి కోరలను బలిచ్చే ధీరుని ప్రచండ దాడికి సిద్ధం’’ అంటూ ఓ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ డైలాగ్ కి ఫిదా అయిపోతున్నారు. కచ్చితంగా కొరటాల చెప్పిన కథకి సరిగ్గా సూట్ అయిపోయిందని… భయపెట్టే మనిషి.. నోట ఈ మాత్రపు డైలాగ్ ఉండటంలో తప్పు లేదని చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. “RRR”తో ప్రపంచ స్థాయిలో ఎన్టీఆర్ ఇమేజ్ సంపాదించడం తెలిసిందే. దీంతో అదే తరహాలో “NTR 30” సినిమా ఉండబోతున్నట్లు సరికొత్త కాన్సెప్ట్ తో కొరటాల తీయబోతున్నట్లు సమాచారం.
2016లో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” అనే సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్… విజయం సాధించింది. అయితే ఇప్పుడు చేయబోయేది తారక్ కెరియర్ లో 30వ సినిమా కావటంతో స్క్రిప్ట్ పైన దాదాపు ఏడాదికి పైగా కొరటాల శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని “RRR” విజయాన్ని దృష్టిలో పెట్టుకుని.. చాలా పగడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు సినిమా టైటిల్ ప్రకటించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.