NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: “NTR 30” సినిమా షూటింగ్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన కొరటాల శివ..!!

Share

NTR 30: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో ఈ సినిమాకి సంబంధించి పూజ కార్యక్రమాలు ప్రారంభం కాగా ఈ ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి అని ఏర్పాట్లు చేయడం జరిగింది. కెరీయర్ లో 30వ సినిమా కావటంతో.. తారక్ స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్త వహించారు. “RRR”.. ప్రపంచ స్థాయిలో విజయం సాధించటంతో మొదట అనుకున్న స్క్రిప్ట్ కంటే.. మరింత మెరుగ్గా కొరటాల… కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ సరసన దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటిస్తోంది.

NTR 30 movie shooting special video released by Koratala Siva

ఫస్ట్ టైం ఈ సినిమాతో జాహ్నవి సౌత్ లో ఎంట్రీ ఇస్తూ ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అంతేకాదు ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం రంగంలోకి దిగారు. ఈ సినిమా ప్రకటన చేసి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న మొన్నటి వరకు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో అభిమానులు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. పైగా “RRR” వంటి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఏడాది తారక్ గ్యాప్ తీసుకోవటం.. జరిగింది. అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న కొరటాల సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుంది. దీంతో “RRR” వంటి పెద్ద సినిమా తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ వస్తోంది.

NTR 30 movie shooting special video released by Koratala Siva

పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్న తరుణంలో కొరటాల శివ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సెట్స్ లోకీ ఎన్టీఆర్ వస్తూ ఉన్న వాకింగ్ స్టిల్ బ్యాక్ నుంచి రికార్డింగ్ చేయడం జరిగింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. “NTR 30” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మే నెలలో తారక్ పుట్టినరోజు నేపథ్యంలో.. టైటిల్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమా చేయనున్నారట.

 


Share

Related posts

Rajamouli Mahesh: రాజమౌళి కెరియర్ లో ఫస్ట్ టైం.. మహేష్ ప్రాజెక్ట్ లో రివర్స్..??

sekhar

బ్రేకింగ్: ఫస్ట్ ఆన్ న్యూస్ ఆర్బిట్: రేపు ప్రకటించబోయే ప్రభాస్ హీరోయిన్ పేరు ఇదే!

Vihari

Sarkaru vaari paata : సర్కారు వారి పాట రికార్డుల వేట మొదలు..ఈసారీ బాక్సాఫీస్ వద్ద కొత్త లెక్కలే

GRK