18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: ఎన్టీఆర్ 30 కొత్త అప్ డేట్ తో… నిరుత్సాహం చెందిన ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

Share

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో “జనతా గ్యారేజ్” రావటం తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు సినిమా వస్తూ ఉండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30ది కావటంతో… చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. పైగా ఈ సినిమా ప్రకటించక “RRR” భారీ బ్లాక్ బస్టర్ కావడంతో… కొరటాల ఈ ప్రాజెక్టు విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు.

NTR 30 Regular Shooting Update Release Date Finalised
NTR 30

పాన్ ఇండియా లెవెల్ లో తారక్ పేరు మారు మరుగుతూ ఉండటంతో ఆదేశాన్ని స్టోరీ లో కొన్ని మార్పులు చేసి రెడీ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అని అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. కానీ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ మొన్నటి వరకు రాలేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా “NTR 30” ట్రెండ్ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో తాజాగా సినిమా యూనిట్ వచ్చేనెల నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు జనవరి ఫస్ట్ నాడు పోస్టర్ తో కూడిన అప్ డేట్ ఇవ్వడం జరిగింది.

NTR 30 Regular Shooting Update Release Date Finalised
NTR 30

ఏప్రిల్ 5… 2024వ సంవత్సరం నాడు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. దీంతో అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. మరి ఇంత లేటా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో ఈ ఏడాది ఎన్టీఆర్ నుండి సినిమా రావటం లేదని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కుటుంబంతో విదేశాలలో రిలాక్స్ అవ్వుతున్నాడు. సో తాజా ప్రకటన బట్టి వచ్చే నెల నుండి ఎన్టీఆర్ షూటింగ్ లో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.


Share

Related posts

రితేష్‌, జెనీలియా దంపతుల దాతృత్వం

Siva Prasad

నిర్మాతగా మారుతున్న అనుష్క 

Siva Prasad

చమ్మక్ చంద్ర పై నాగబాబు కామెంట్స్ వైరల్..! సమాజంలో ముసుగు ధరించి బ్రతుకుతున్నారు..!

arun kanna