66వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా ఈసారి సత్తాను చాటింది. పలు విభాగాల్లో ఏడు అవార్డులను తెలుగు సినిమాలు సొంతం
చేసుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ స్పందనను తెలియజేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అవార్డు గ్రహీతలను
ట్విట్టర్ ద్వారా అభినందించారు. తెలుగు సినిమా రంగానికి ఏడు జాతీయ అవార్డులు రావడంపై హర్షం వ్యక్తం చేసిన ఎన్.టి.ఆర్ టాలీవుడ్
దూసుకెళ్తోందని వ్యాఖ్యానించారు. మహానటికి మూడు అవార్డులు రాగా.. అ! చిత్రానికి రెండు అవార్డులు, రంగస్థలం సినిమాకు ఒక
అవార్డు, చి.ల.సౌ చిత్రానికి ఒక అవార్డు వచ్చింది.
previous post
next post