25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

NTR: అమెరికా నుండి హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్ విమానాశ్రయంలో కీలక వ్యాఖ్యలు..!!

Share

NTR: మార్చి 13వ తారీకు అమెరికా లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో “RRR” ఆస్కార్ అవార్డు దక్కించుకోవడంతో దేశవ్యాప్తంగా చాలామంది సినిమా యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. అయితే ఈ వేడుకకు ముందుగానే చరణ్, రాజమౌళి వెళ్ళటం జరిగింది. నందమూరి తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా వెళ్లారు. ఇలా ఉంటే నేడు అమెరికా నుండి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి తారక్ చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు ఘన స్వాగతం పలికారు.

NTR arrived in Hyderabad from America and made important comments at the airport

అనంతరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో ఎన్టీఆర్ మాట్లాడుతూ… ఆస్కార్ మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. రాజమౌళి చేతిలో ఆస్కార్ చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయని స్పష్టం చేశారు. ఆస్కార్ వచ్చిన విషయాన్ని మొదట తన భార్యకి చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. ఇక్కడిదాకా తమను తీసుకొచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ నెల నుండి కొరటాల శివ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. దాదాపు ఏడాది పాటు షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు. కొరటాల ప్రాజెక్టు అనంతరం “RRR 2” చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం జరిగింది.

NTR arrived in Hyderabad from America and made important comments at the airport

ఇది ఈ ఏడాదిలోనే స్టార్ట్ కానుంది. “RRR” రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా ఆస్కార్ ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజమౌళి ఫుల్ బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని. మే నెలలో కృష్ణ పుట్టినరోజు నాడు మహేష్ ప్రాజెక్ట్ అధికారికంగా రాజమౌళి ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు తర్వాత “RRR 2” స్టార్ట్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు టాక్.


Share

Related posts

Prabhas: ప్ర‌భాస్ ఆ మాట‌న‌గానే షాక్ అయ్యా.. సీనియర్‌ నటి కామెంట్స్ వైర‌ల్‌!

kavya N

త్రివిక్ర‌మ్ మూవీతో మ‌హేశ్ బాబు క్రేజీ రోల్‌.. కెరీర్‌లోనే తొలి సారి అలా!

kavya N

Nani : నాని మీద చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారట..!

GRK