NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “RRR” చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటిసారి మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ సినిమా చేస్తూండటంతో సినిమాపై అంచనాలు ఇండస్ట్రీ వర్గాల లో ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా “బాహుబలి” తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో .. ఆలిండియా స్థాయిలో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన కెరీర్లో 30 ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రకటన కూడా రావడం జరిగింది.
మొదటిలో త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేద్దామని భావించిన .. తర్వాత వాయిదా పడటం కొరటాల పేరు తెరపైకి రావడం జరిగింది. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” అనే సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే 30 వ సినిమా స్టోరీ ఏంటి అన్నదానిపై నందమూరి అభిమానులలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ బ్యాక్ డ్రాప్ లో కొరటాల చూపించబోతున్నాడు అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల లో బలంగా వినబడుతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో స్క్రిప్ట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ నటించిన రెండో సినిమా అవుతుంది. గతంలో నాగ అనే సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా నటించారు. ఆ సినిమా ప్రేక్షకులను అలరించలేదు. మరి కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ ఏ విధంగా అలరిస్తాడో చూడాలి.