బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’, నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రానున్న ఈ సినిమాని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా నుంచి ఎన్టీఆర్-ఏఎన్నార్ ఉన్న ప్రోమో ఒకటి రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో తెలుగు వాడి వేడి, తెలుగు రక్తం నెత్తురు వేడి దేశమంతా తెలియాలి అని చెప్పిన డైలాగ్ ఆ నాటి పరిస్థితులని గుర్తు చేశాయి. ఇక నాగేశ్వర్ రావు పాత్రలో నటిస్తున్న అక్కినేని సుమంత్, తాతగారిని మళ్లీ తెరపై చూపించాడు.
previous post
next post