Ram Charan Tej: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “RRR” కీ ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఢిల్లీలో దిగటం జరిగింది. RRR ఆస్కార్ అందుకున్న తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. దీంతో చిత్ర దర్శకుడు రాజమౌళి పై సినిమా యూనిట్ పై చాలామంది ప్రశంసల కురిపిస్తున్నారు. ఆస్కార్ వచ్చిన రోజు దేశ ప్రధాని మొదలుకొని రాజకీయ నేతలు సినిమా సెలబ్రిటీలు… పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఆస్కార్ అందుకున్న తర్వాత… ఢిల్లీ విమానశ్రమ దిగిన రామ్ చరణ్ ఇండియా టుడే కంక్లెవ్ 2023 సెషన్ లో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా RRR దర్శకుడు రాజమౌళి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత… అదే తరహా గౌరవించే వ్యక్తి రాజమౌళి అని స్పష్టం చేశారు. 14 సంవత్సరాల క్రితం మగధీరతో తనకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్… తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. పనిలో ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ అయిపోయారు. బాబాయ్ పవన్ నాన్న చిరంజీవి తనకు రెండు కళ్ళ లాంటి వారిని చరణ్ చెప్పుకోచ్చారు. ఇక RRR రాజమౌళి తమతో చేయటానికి ప్రధాన కారణం తో తనకున్న స్నేహం అని చరణ్ తెలియజేశారు.
సినిమా స్టోరీ కూడా ఇద్దరూ స్నేహితులకు సంబంధించినది కావటంతో మ్యాచ్ అవుతుందని.. భావించి తామిద్దరిని ఎంచుకున్నారని తెలిపారు. సినిమాలో నందమూరి వర్సెస్ మెగా అభిమానులపరంగా గత 35 సంవత్సరాల నుండి పోటీ నడుస్తుంది. కానీ వ్యక్తిగతంగా రెండు కుటుంబాల మధ్య అలాంటిది ఏమీ లేదని చరణ్ పేర్కొన్నారు. ఒకవేళ ఈ సినిమాకి రాజమౌళి దర్శకుడు కాకపోతే తారక్ తన కాంబినేషన్ సెట్ అయ్యేది కాదని అన్నారు. రాజమౌళి కాబట్టి ఇద్దరం కూడా కథని బలంగా నమ్మి గుడ్డిగా కెరియర్ మొత్తం ఆయన చేతుల్లో పెట్టేసాం.. అంటూ చరణ్ ఢిల్లీలో జరిగిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.