NTR: నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలకు సంబంధించి అప్ డేట్ లు రావడం మనం చూశాం. ప్రస్తుతం తారక్.. కొరటాల శివ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. “RRR” వంటి అతి పెద్ద విజయం సాధించిన సినిమా తర్వాత చేస్తున్న ఈ సినిమాపై తారక్ చాలా శ్రద్ధ పెడుతున్నాడు. తన కెరియర్ లో 30వ సినిమా పైగా రాజమౌళి తర్వాత చేసే సినిమా కావటంతో… ఎట్టి పరిస్థితుల్లో గురి తప్పకుండా పరాజయం పాలు కాకుండా స్టోరీ పరంగా అన్ని రకాలుగా కొరటాల తారక్ చాలా హోం వర్క్ చేయడం జరిగిందట. అయితే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జూలై నుండి స్టార్ట్ కానున్నట్లు సమాచారం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక అనుకోకుండా ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు నుండి ఎన్టీఆర్ పోస్టర్ రిలీజ్ కావటంతో పాటు లుక్ చాలా మాస్ పవర్ ఫుల్…గా కనిపించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ ఒప్పుకున్న ప్రాజెక్టుల గురించి.. ఈ రెండు సినిమాలు అప్డేట్ వచ్చినా గాని బుచ్చిబాబు ప్రాజెక్ట్ కూడా గత కొద్ది నెలల నుండి వినికిడిలో ఉంది. బుచ్చిబాబు కూడా పలు ఇంటర్వ్యూలలో తారక్ తో సినిమా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో బుచ్చిబాబు సినిమాకి సంబంధించి అప్ డేట్ రాకపోవటం అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది.
అయితే తాజాగా బుచ్చిబాబు ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్డేట్ ఇండస్ట్రీలో వినబడుతోంది. ఈ సినిమా ఫస్టాఫ్ అంతా బాగానే ఉన్నా కానీ సెకండాఫ్ .. తారక్ ఇంకా ఓకే చేయలేదని టాక్. దీంతో సెకండాఫ్ స్క్రిప్టుపైనే బుచ్చిబాబు ఇప్పుడు వర్క్ చేస్తున్నట్లు త్వరలోనే.. మొత్తం స్క్రిప్ట్ కంప్లీట్ చేసి ఎన్టీఆర్ కి మళ్లీ వినిపించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓకే అయితే అప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఏదేమైనా ఎన్టీఆర్ బర్త్ డే నాడు కొరటాల ప్రాజెక్టుతో పాటు ప్రశాంత్ నీల్ కి సంబంధించిన ప్రాజెక్టు అప్డేట్ లు రావటంతో ఎన్టీఆర్.. అసలు సిసలైన టైం ఇప్పుడు స్టార్ట్ అయింది అని … అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!