RRR: కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఎన్టీఆర్, చరణ్..??

Share

RRR: “RRR” సినిమాతో దేశవ్యాప్తంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు .. చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ ముగ్గురు దేశం మొత్తం చుట్టేశారు. సో సినిమా రిజల్ట్ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు.. ఏకంగా వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించడం జరిగింది. RRR పేరు బాగా పాపులర్ అయిపోయింది. ఆ టైంలో మార్కెట్ లో “RRR” షర్ట్స్.. కాప్స్ కూడా వచ్చాయి. బాగా అమ్ముడుపోయాయి.

దీంతో ఈ పేరును క్యాష్ చేసుకోవడానికి ప్రముఖ హోటల్ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్ నడుస్తుంది. “RRR” పేరుతో దేశ వ్యాప్తంగా… ప్రధాన నగరాలలో హోటల్స్ పెట్టాలని ఆ హోటల్ యాజమాన్యం డిసైడ్ అయినట్టు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఇందుకోసం పార్ట్నర్స్ గా చరణ్, ఎన్టీఆర్ చేత కూడా పెట్టుబడులు పెట్టించడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇద్దరు కూడా ఓకే చెప్పినట్లు టాక్. అయితే ఈ హోటల్ బిజినెస్ విషయంలో రాజమౌళి కూడా సంప్రదించినట్లు, కానీ రాజమౌళి ఇంట్రెస్ట్ లేదని తప్పుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా చేస్తూనే మరోపక్క నిర్మాతగా ఇంకో పక్క పలు బిజినెస్ లు చేస్తూ ఉన్నారు. ఇంక తారక్ వచ్చేసరికి పూర్తి కాన్సెంట్రేషన్ సినిమాలపైనే. “RRR” పేరు సంచలనం సృష్టించటంతో ఆ పెద్ద హోటల్ కంపెనీ మానేజ్మెంట్  ఈ ఇద్దరు హీరోలతో బిజినెస్ లోకి వెళ్ళటానికి స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు మీడియాలో న్యూస్ వైరల్ అవ్వుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో “RC15” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరో పక్క ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే “NTR 30″కి సంబంధించి షూటింగ్ కి రెడీ అవుతున్నారు. మరి వస్తున్న “RRR” హోటల్స్ కి సంబంధించిన వార్తలపై ఇద్దరు హీరోలు ఎలా స్పందిస్తారోచూడాలి.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

9 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

18 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

55 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

59 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago