RRR: చాలాకాలానికి “ఆర్ఆర్ఆర్” థియేటర్ లో సందడి చేయడంతో .. అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటికే స్పెషల్ షోలు పడిపోవడంతో .. సినిమా బ్లాక్ బస్టర్ అని చూసిన అభిమానులు జనాలు అంటున్నారు. ప్రతి ఫ్రేమ్ చూసే ప్రేక్షకుడికి రోమాలు నిక్కబొడుచుకునేలా జక్కన్న చిత్రీకరించాడని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్నటి వరకు ఇంటర్వ్యూలలో ఫుల్ బిజీ అయినా “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల కావటంతో పాజిటివ్ టాక్ రావడంతో ఫుల్ జోష్ లో ఉంది. నిన్న అర్ధరాత్రి నుండే స్పెషల్ షో లు పడిపోవడం జరిగాయి.
హైదరాబాద్ లో సందడిగా స్పెషల్ బెనిఫిట్ షోకి అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ AMB థియేటర్ లో సందడి చేయగా.. రాజమౌళి, చరణ్ ఇంటి సభ్యులు భ్రమరాంబ థియేటర్ లో సందడి చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నిన్ననే జాతర మొదలవగా నాలుగేళ్ల నుండి.. పడిన కష్టానికి కళ్ళు చెదిరే ప్రతిఫలం వచ్చినట్లు….”ఆర్ఆర్ఆర్” కచ్చితంగా “బాహుబలి” రికార్డులను బ్రేక్ చేయడం గ్యారెంటీ అని సినిమా చూసిన ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు.
బ్లాక్బస్టర్ టాక్ రావడంతో థియేటర్ల దగ్గర మెగా మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. దాదాపు నాలుగు సంవత్సరాలు ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలు ఎన్టీఆర్ చరణ్ పడిన కష్టానికి… రాజమౌళి తిరుగులేని రిజల్ట్ ఇవ్వటం జరిగిందని చూసిన జనాలు చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్ అదేవిధంగా చరణ్ ఎంట్రీ సీన్ లు కళ్ళు చెదిరే రీతిలో జక్కన్న అందించాడని.. అరుణ్ సన్నివేశాలకు టికెట్ ధరలకి న్యాయం చేశాడని సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అని చూసిన జనాలు చెప్పుకొస్తున్నారు. ఇంకా రికార్డుల వేట మళ్ళీ మొదలైంది అని గ్యారెంటీగా బాహుబలి కంటే “ఆర్ఆర్ఆర్” కొత్త రికార్డులు సృష్టించడం జరుగుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.