29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

RRR: ఆస్కార్ వేదికపై డాన్స్ పర్ఫామెన్స్ విషయంలో ఎన్టీఆర్ క్లారిటీ..!!

Share

RRR: ఈనెల 13వ తారీకు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో “RRR” నాటు నాటు సాంగ్ ఎన్నిక కావడం తెలిసిందే. ప్రస్తుతం చరణ్, తారక్, రాజమౌళి ఇంకా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి… “నాటు నాటు” పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవా అక్కడే ఉన్నారు. నాటు నాటు సాంగ్ లో స్టెప్పులు దేశంలోనే కాదు విదేశాలలో కూడా చాలా ఆకట్టుకోవడం జరిగింది. దీంతో ఆస్కార్ అవార్డులు ఇచ్చే వేదికపై.. చరణ్ మరియు ఎన్టీఆర్ స్టెప్పులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

NTR clarity on dance performance on Oscar stage

ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్… తాము ఆస్కార్ వేదికపై పెర్ఫార్మన్స్ చేయడం లేదని స్పష్టం చేశారు. కానీ సంగీత దర్శకుడు కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ మాత్రమే డాన్స్ వేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో నందమూరి మరియు మెగా అభిమానులు నిరాశ చెందారు. ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా వేదికలపై ఎన్టీఆర్, చరణ్ “నాటు నాటు” పాటకు స్టెప్పులు వేశారు. ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ వేదికపై వేస్తే బాగుండేది అని అభిమానులు అంటున్నారు.మరోపక్క ఈ సాంగ్ లో స్టెప్పులు కోసం షూటింగ్ కి వారం రోజులు ముందుగానే ప్రాక్టీస్ స్టార్ట్ చేసినట్లు ఎన్టీఆర్ తెలిపారు.

NTR clarity on dance performance on Oscar stage

ఇద్దరి స్టెప్పులు సింక్ అవ్వడానికి కనీసం మూడు గంటలు పట్టింది. ఇప్పటికీ కూడా నా కాళ్లు నొప్పులు పడుతుంటాయి అని.. ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. కాగా ఇప్పటికే ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం జరిగింది. దీంతో కచ్చితంగా ఆస్కార్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


Share

Related posts

Alia bhatt: గంగూబాయి రిజల్ట్ తేడా కొడితే ఆర్ఆర్ఆర్ మీద తీవ్రంగా ఎఫెక్ట్..మేకర్స్ జాగ్రత్తపడితే బావుండేది..?

GRK

బిగ్ బాస్ 4! టైటిల్ గెలిచేది ఎవరో చెప్పేసిన టాలీవుడ్ హీరో శ్రీకాంత్…

arun kanna

Icon : ఐకాన్ స్క్రిప్ట్ లో మార్పులు..పాన్ రేంజ్ లో ప్లాన్

GRK