NTR: తమ అభిమాన హీరోలపై ప్రేమ, అభిమానం చూపించడానికి ఓ హద్దుంటుంది. కానీ, గత కొంతకాలంగా అది మరీ మితిమీరిపోతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్, రానా నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సందర్భంగా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మూగ జీవాలను బలిచ్చారు. ఇది తెలిసి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు అభిమానం అనేది హద్దుల్లో ఉంటే అందరికీ మంచిది. లేదంటే లేనిపోని సమస్యలను కొనితెచ్చుకు న్నట్టు అవుతుంది. ఇలాంటి పనులు చేస్తే తమ అభిమాన హీరో కూడా అండగా నిలవ లేడు అనేది వాస్తవం. అయితే, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అభిమానులు మాత్రం ఇలా కాదు.
కానీ, హాట్ టాపిక్ మాత్రం అవుతున్నారు. ఎన్టీఆర్ తొలిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటించారు. ఈ సినిమాకు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25వ తేదీన రిలీజ్ అవుతోంది. ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై రికార్డ్ స్థాయిలో టికెట్లు అమ్ముడవుతూ ఆర్ఆర్ఆర్ మీద ఉన్న క్రేజ్ ఎంతటిదో తెలియజేస్తుంది. అయితే, ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఓ అభిమాని ఏకంగా అమెరికా లో 75 టికెట్లను కొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది.
NTR: ఆర్ఆర్ఆర్ 14 భాషలలో రిలీజ్ కానుండటం మరొక రికార్డ్
ఈ క్రమంలోనే అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఒక థియేటర్ ఈవినింగ్ షో మొత్తాన్ని ఎన్టీఆర్ అభిమానులు బుక్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ రకంగా అభిమానులు ఎన్టీఆర్ మీద తమకున్న ప్రేమాభిమానాలను మరోసారి రుజువు చేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత మన టాలీవుడ్ స్టార్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా అసాధారణమైన క్రేజ్ దక్కడం..అభిమానులు, అభిమాన సంఘాలు విదేశాలలో నెలకొనడం గొప్ప విషయం. కాగా, ఆర్ఆర్ఆర్ 14 భాషలలో రిలీజ్ కానుండటం మరొక రికార్డ్ అని అంటున్నారు. ఇన్ని భాషలలో ఇంతకముందెప్పు డూ ఏ సౌత్ సినిమా రిలీజ్ కాలేదు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!