Rajamouli: RRR సినిమా ఎప్పుడు రిలీజయ్యిందో అప్పటినుండి నందమూరి అభిమానులు దర్శకధీరుడు రాజమౌళిపైన సందర్భం వచ్చినప్పుడల్లా తమ అక్కసుని వెళ్లగక్కుతున్నారు.జక్కన్నకు,ఎన్టీఆర్కు ఉన్న సన్నిహిత సంబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. ఓరకంగా NTRకి ఓ రేంజ్ స్టార్ డమ్ రాజమౌళి వలెనే వచ్చింది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి వీరి ప్రస్థానం మొదలయ్యింది. కానీ RRR తరువాత మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కారణాలుగా వీటిని చూపుతున్నారు?
RRR సినిమాలో మనకెవ్వరికీ అభ్యంతరం లేని విషయాలపైన వారు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే, హీరో రామ్ చరణ్ పాత్ర కంటే NTR పాత్ర తక్కువయిందని ఒకటి, రెండు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి ట్వీట్ చేయలేదట. ఈ రెండు కారణాలను ఎట్టి చూపుతూ వారు వారి పైత్యాన్ని చూపుతున్నారు. ఇకపోతే తాజాగా సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా టాలీవుడ్ మొత్తం నివాళి అర్పించింది. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ కూడా ట్వీట్లు చేసిన విషయం తెలిసినదే. కానీ రాజమౌళి మాత్రం సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ల మీద ట్వీట్లు వేయడం లేదని నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజమౌళికి కళ్ళు నెత్తికెక్కాయట?
అవును.. ఆ మాట అంటున్నది నందమూరి అభిమానులే. RRR సక్సెస్ తో జక్కన్నకు కళ్లు నెత్తికెక్కినట్టున్నాయ్, జేమ్స్ కేమరూన్ అని అనుకుంటున్నదేమో.. ఎన్టీఆర్ లాంటి మహానటుడి శతజయంతికి కూడా స్పందించే టైం లేదా? అంటూ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. ట్విట్టర్ వేదికగా రెచ్చిపోతున్నారు. అయితే ఎన్టీఆర్ బర్త్ డేకు ట్వీట్ వేయలేదని కొందరు అంటుంటే.. ఇంకొందరు మాత్రం దాన్ని కవర్ చేస్తూ, పర్సనల్గా ఫోన్ చేసి విష్ చేసి ఉండొచ్చు కదా? అని ఇంకొందరు పసుపు రాయడం కొసమెరుపు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!