RRR: “బాహుబలి” తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా RRR. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ఫస్ట్ టైం నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఒకపక్క “బాహుబలి”తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో అన్ని రికార్డులను పగలగొట్టిన జక్కన్న సినిమా చేస్తూండటంతో దేశం మొత్తం మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. రామరాజు పాత్రలో రామ్ చరణ్.. నటించడమే కాక “కొమరం భీమ్” పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ కి అన్నగా.. నటిస్తూ ఉండటంతో సినిమా రేంజ్ ఉహించిన విధంగా మారిపోయింది.
ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం బయటకు వస్తున్న ప్రతి వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్… ఎన్టీఆర్ తండ్రి గా నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. మేటర్ లోకి వెళ్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్ననాటి పాత్ర చేసిన ఒక బుడ్డోడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.
Read More: RRR: “RRR” లో డిఫరెంట్ స్పెషల్ సాంగ్ డీటెయిల్స్..!!
ఎన్టీఆర్ తండ్రిగా అజయ్ దేవగన్ సినిమాలో నటించినట్లు బుడ్డోడు చెప్పుకొచ్చాడు. దీంతో ఇద్దరూ మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు.. చేసి ఉంటారని.. ఇద్దరి టాలెంట్ నీ.. జక్కన్న పిండేసి ఉంటాడని.. మామూలు వాడకం ఉండదు కదా.. కచ్చితంగా ఈ ఇద్దరు స్క్రీన్ పై కనబడితే… ఆ సన్నివేశాలు మరో రేంజ్ లో ఉండటం గ్యారెంటీ అని.. తాజా వార్త పై సినిమా అభిమానులు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.