ఇప్పుడున్న ఆర్టిస్టులందరూ సినిమాలపైనే కాకుండా.. ఇతర రంగాల్లో కూడా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు సినీ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులను ఫ్యాషన్ డిజైనింగ్, హోటల్స్, బోటిక్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటే.. కొందరు మాత్రం సినిమాకు అనుసంధానమైన వాటిల్లోనే డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టార్ హీరోల విషయానికి వస్తే.. రామ్‌చరణ్ హీరోగా నిర్మాతగానే కాకుండా.. ఎయిర్‌లైన్స్ బిజినెస్‌లో కూడా మనీని ఇన్వెస్ట్ చేశారు. మరో స్టార్ హీరో మహేష్ బాబు .. కమర్షియల్ యాడ్స్‌లో బాగానే సంపాదిస్తున్నాడు. ఇప్పుడు నెమ్మదిగా సినిమాకు సంబంధించిన థియేటర్స్ నిర్మాణంలో ప్రవేశించాడు. అలాగే సినిమాల నిర్మాణంలో(జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్ ద్వారా) కూడా ప్రవేశించాడు. ఇప్పుడు మహేష్ దారిలోనే ప్రయాణించాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఎలాగంటే..ఎన్టీఆర్ థియేటర్స్ బిజినెస్‌లోకి ఎంటర్ కావాలనుకుంటున్నాడట. అందుకు తగిన విధంగా కొంత మందితో ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నాడని వార్తలు వినపడుతున్నాయి. అయితే మమేష్ ఎ.ఎం.బి సినిమాస్ గ్రూప్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ మాత్రం తన థియేటర్స్ బిజినెస్‌ను అమరావతిలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాడని టాక్. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
previous post
next post