NewsOrbit
సినిమా

NTR: తెలుగు మ‌ర‌చిపోయిన ఎన్టీఆర్‌.. వీడియో చూస్తే న‌వ్వులే!

NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్‌` ప్ర‌మోష‌న్స్‌తో గ‌త కొద్ది రోజుల నుంచీ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌రో హీరోగా న‌టించ‌గా.. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇందులో అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవగన్, శ్రియ‌, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్ కీల‌క పాత్ర‌ల్లో అల‌రించ‌బోతున్నారు. అనేక కష్టాలు, స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూ సూమారు నాలుగేళ్లపాటు ఈ మూవీని రూపొందించారు. యావత్ సినీ ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మ‌రికొన్ని గంట‌ల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌టంతో.. థియేట‌ర్స్ వ‌ద్ద అభిమానులు హంగామా వేరె లేవ‌ల్‌లో క‌నిపిస్తోంది.

ఇక ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నార్త్ ఇండియా మొత్తం చుట్టేసిన ఆర్ఆర్ఆర్ టీమ్‌.. బుధవారం నుంచి హైదరాబాద్ లో తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, రాజ‌మౌళిలో ప్ర‌ముఖ టీవీ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. అయితే అక్క‌డ ఎన్టీఆర్‌ను యాంక‌ర్.. `రామ్ చరణ్ తో కలిసి ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీన్ చేయడం, ఇద్దరు కొట్టుకోవడం మీకు ఎలా అనిపించింది..? `అంటూ తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ చేసి ప్రశ్నించింది.

నార్త్‌లో సినిమాను ప్ర‌మోట్ చేసి చేసి రెస్ట్ లేదో ఏమో కానీ.. యాంక‌ర్ అడిన ప్ర‌శ్న‌కు ఎన్టీఆర్ తెలుగు మ‌ర‌చిపోయి హిందీలో అన్స‌ర్ ఇవ్వ‌డం మొద‌లు పెట్టాడు. వెంటనే రాజమౌళి, చ‌ర‌ణ్‌లు అందుకుని నార్త్ ఇండియా అయిపోయింది.. సౌత్‌.. ఇది హైదరాబాద్ అని గుర్తు చేశారు. వెంటనే మాఫ్ కర్ అని ఎన్టీఆర్ మళ్లీ హిందీలోనే మాట్లాడ‌బోతుండ‌గా తెలుగు.. తెలుగు అంటూ రాజమౌళి మ‌ళ్లీ గ‌ట్టిగా చెప్పాడు. మొత్తానికి ఇందుకు సంబంధించిన వీడియో నెటిజ‌న్ల చేత న‌వ్వులు పూయిస్తూ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

author avatar
kavya N

Related posts

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu