NTR: ఆర్ఆర్ఆర్ కమిటవడం వల్ల ఎన్టీఆర్ ఎన్ని కోట్లు పోగుట్టున్నాడో తెలిస్తే ఒక్కరికీ నోటమాట రాదు..!

Share

NTR: ఆర్ఆర్ఆర్ కమిటవడం వల్ల ఎన్టీఆర్ ఎన్ని కోట్లు పోగుట్టున్నాడో తెలిస్తే అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వచ్చి వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమా కమిటడం వల్ల ఎన్టీఆర్ కి నష్టమే తప్ప లాభపడింది లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారట. రాజమౌళి సినిమా అంటే ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ అంచనా వేయలేరు. ఇక పాన్ ఇండియన్ సినిమా అంటే ఎవరి ఆలోచనకి వారిని వదిలేయాల్సిందే. ఒక్కో సీన్‌ను రోజుల తరబడి తీస్తూనే ఉంటారు. ఏ చిన్న సందేహం ఉన్నా మళ్ళీ ఆ సీన్ మొత్తాన్ని రీ షూట్ అనేస్తారు.

ntr-got huge loss due to rrr
ntr-got huge loss due to rrr

అందుకే రాజమౌళి సినిమా అంటే హీరో మరో సినిమాను కమిటవడు. రాజమౌళి ఓకే అంటేనే తప్ప కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేయరు. ఒకవేళ చేసినా రాజమౌళి సినిమా షూటింగ్, డబ్బింగ్, ప్రమోషన్స్ మొత్తం అయ్యాక గానీ పూర్తి స్థాయిలో మరో సినిమాలో జాయిన్ కాలేరు. ఇప్పుడు ఎన్టీఆర్ పరిస్థితి ఇదే అయిందని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ – రాం చరణ్ కలిసి హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మొదలు పెట్టి మూడేళ్ళుకు పైగానే అయింది. అప్పటి నుంచి ఈ హీరోలిద్దరు మరో సినిమాను చేయలేకపోయారు. కరోనా కారణంగా ఏ ప్లాన్స్ వర్కౌట్ కాలేదు.

NTR: అసలు మ్యాటర్ ఏంటనేది వారికే తెలియాలి.

అదే రాజమౌళి సినిమా కాకపోయి ఉంటే ఎన్టీఆర్ కనీసం మూడు సినిమాలనైనా పూర్తి చేసి ఉండేవాడని అభిమానులు చెప్పుకుంటున్నారట. అంతేకాదు యావరేజ్‌గా చూసుకున్నా కూడా ఈ మూడు సినిమాల వల్ల 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకునేవాడు ఎన్టీఆర్. కానీ ఈ మూడేళ్ళు ఆర్ఆర్ఆర్ సినిమానే చేస్తూ ఉండటంతో ఆయనకు అందిన రెమ్యునరేషన్ కేవలం 50 కోట్లు మాత్రమే అని అంటున్నారు. అంటే 100 కోట్లు ఎన్టీఆర్ నష్టపోయాడని దీనిని బట్టి అర్థమవుతోంది. ఇది ఒక టాక్ మాత్రమే. అసలు మ్యాటర్ ఏంటనేది వారికే తెలియాలి.


Share

Related posts

జీహెచ్ఎంసీ అప్‌డేట్స్..రెండు డివిజన్‌ల ఫలితాలు వెల్లడి

somaraju sharma

Eesha Rebba Black Saree Photos

Gallery Desk

రూ.2700 కోట్ల పందేరం… జగన్ – గల్లా జయదేవ్ ల “ఇగో” వార్!

CMR