న్యూస్ సినిమా

NTR: ఇలాంటి స్టోరీలో ఎన్టీఆర్ ఎప్పుడూ నటించలేదు..అందుకే ఆ దర్శకుడు 10 ఏళ్ళు కష్టపడి మరీ రాశాడు..

Share

NTR: ఇలాంటి స్టోరీలో ఎన్టీఆర్ ఎప్పుడూ నటించలేదు..అందుకే ఆ దర్శకుడు 10 ఏళ్ళు కష్టపడి మరీ రాశాడట..అంటూ ప్రస్తుతం ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ దర్శకుడే ఉప్పెన సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సానా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ..ఆయన నటించిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ కోసం దాదాపు 4 ఏళ్ల సమయం కేటాయించాడనే విషయం తెలిసిందే. రాజమౌళి కావడంతో ఇన్నేళ్ళు ఇచ్చేశాడు తారక్. ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదల కావల్సింది. కానీ, కరోనా మూలంగా వాయిదా పడుతోంది. ఇక ఇదే కరోనా వల్ల ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కూడా ఆలస్యం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

NTR has never acted in a story like this
NTR has never acted in a story like this

ఇప్పటికే ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేయనున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. అలాగే ఎన్టీఆర్ దర్శకుడు బుచ్చి బాబు సినిమా కూడా ఈ పాటికే మొదలవ్వాల్సింది. ఈ దర్శకుడు ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేస్తున్నట్లుగా పలు సందర్బాల్లో చెప్పాడు. ఎన్టీఆర్, బుచ్చి బాబుల మూవీ మొదలవడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఈ చిత్ర కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. బుచ్చిబాబు కథ నేపథ్యాన్ని బాగా మాస్ కథను తయారు చేశారట.

NTR: ఎన్టీఆర్ ఈ పాయింట్ చెప్పినప్పటి నుంచి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారట.

ఈ కథ ప్రధానంగా విజయనగరం ప్రాంతంలో జరుగుతుందని తెలుస్తోంది. చిత్రీకరణలో ఎక్కువభాగం విజయనగరం ఆ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరణ చేయబోతున్నట్లుగా ప్రచారం అందుతోంది. ఇక ఇప్పటికే బుచ్చి బాబు అక్కడ లొకేషన్స్ కూడా ఫైనల్ చేశారట కథ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో చాలా సింపుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకోబోతున్నారు. అయితే, దీనికి విభిన్నంగా ఈ సినిమా మాత్రం పాన్ ఇండియా స్క్రిప్ట్ కాదాట. చక్కటి తెలుగు నేటివిటీతో ఉండే కథ అని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, దాదాపు పదేళ్ళ నుంచి ఈ కథపై బుచ్చిబాబు కసరత్తులు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ పాయింట్ చెప్పినప్పటి నుంచి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారట.


Share

Related posts

Aakashavaani : ఆకాశవాణి సినిమా నుంచి “మనకోన” పాటను రిలీజ్ చేసిన నాని..!!

bharani jella

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేముందు ఒక్క‌సారి ఇవి తెలుసుకోండి..!

Srikanth A

అయ్యబాబోయ్! అమెజాన్ సంస్థ చాలా పెద్ద ప్లాన్ వేసింది.. ఇక ఇండియా లో థియేటర్లన్నీ… !! 

Naina
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar