NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి ఫ్యామిలీ నుండి అతి తక్కువ వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించాడు. ఎటువంటి పాత్ర అయినా చేయగలిగే హీరో. ఇండస్ట్రీలో ఉన్న అందరూ హీరోల కంటే ఎన్టీఆర్ చాలా విభిన్నమైన వాడు. ఎటువంటి సీన్ మరియు స్టెప్ సింగిల్ టేక్ లో చేసేస్తాడు. ప్రారంభంలో మంచి హిట్లు కొట్టి తర్వాత అనేక పరాజయాలు చూసి మళ్లీ పుంజుకున్నా తారక్ ప్రస్తుతం… వరుస బెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రాజమౌళి దర్శకత్వంలో చేసిన “RRR” సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. ఈ సినిమా తారక్ కి మంచి ఇమేజ్ ప్రపంచ వ్యాప్తంగా తీసుకొచ్చింది. “RRR” విడుదలయ్యాక మొదట చరణ్ కి ఎక్కువ పేరు రాగా… అంతర్జాతీయ స్థాయిలో మాత్రం తారక్ పేరు హై రేంజ్ లో వినిపిస్తోంది.
కొమరం భీమ్ పాత్ర హాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో తారక్ నటన పట్ల వివిధ దేశాలు తమ పత్రికలలో కూడా కథనాలు ప్రచురించిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు “RRR” ఆస్కార్ అవార్డు గెలిచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు ఇంటర్నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకోవడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో అందుకోని ఘనత “RRR” ద్వారా ఎన్టీఆర్ అందుకోవటం జరిగింది.

విషయంలోకి వెళ్తే ఆస్కార్ రేసులో తారక్ దూసుకుపోతున్నాడు. “వెరైటీ” ఆస్కార్ “బెస్ట్ యాక్టర్” ప్రీడక్షన్ లిస్టులో ఎన్టీఆర్ టాప్ టెన్ లో నిలిచాడు. ఇండియన్ ఫిలిం చరిత్రలో తొలిసారిగా ఓ భారతీయ నటుడు టాప్ టెన్ ఆస్కార్ అంచనాల జాబితాలో చోటు దక్కించుకోవటం ఇదే ప్రథమం. ఇప్పటికే నాటు నాటు సాంగ్ ఆస్కార్ షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా ఆస్కార్ రేసులో దూసుకుపోవటం విశేషం.